లాక్ డౌన్‌లో అక్రమంగా తన నివాసంలోనే దందా.. ప్రముఖ నటుడు అరెస్ట్

సెలెబ్రిటీలు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతుంటారు. అందుకే లైమ్ లైట్‌లో ఉండగానే వ్యాపార రంగంలోకి దిగుతారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, క్లబ్, పబ్స్ అంటూ ఒక్కో దాంట్లో పెట్టుబడి పెడతారు. మన తెలుగు తారలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. అయితే కిక్ ఫేమ్ శ్యామ్ కూడా ఓ క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు. అందులో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు జూలు విదిల్చారు. శ్యామ్‌ను అరెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

 కిక్‌తో ఫేమస్..

కిక్‌తో ఫేమస్..

కిక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అక్కడి నుంచి అతని పేరు కూడా కిక్ శ్యామ్‌గా తెలుగులో స్థిరపడిపోయింది. కిక్ భారీ హిట్ అవ్వడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే సురేందర్ రెడ్డి మాత్రం తన సినిమాల్లో శ్యామ్‌కు సపరేట్ పాత్రలు క్రియేట్ చేసేవాడు.

ఊసరవెళ్లి, రేసుగుర్రం..

ఊసరవెళ్లి, రేసుగుర్రం..

శ్యామ్ కెరీర్‌లో ఊసరవెళ్లి, రేసుగుర్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అందులో మరీ ముఖ్యంగా రేసుగుర్రం చిత్రంలో బన్నీకి బ్రదర్‌గా చేసిన పాత్ర అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అంతే కాకుండా శ్యామ్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. కత్తి, ఆక్సిజన్ వంటి అడపాదడపా చిత్రాల్లోనూ నటించాడు.

అనుమతి లేకుండా..

అనుమతి లేకుండా..

కిక్ శ్యామ్ అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ అతనితో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం కోడంబాక్కం పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు.

Recommended Video

Prabhas20 Title Announcement In August, Fans Frustration Peaks
 అక్రమంగా నిర్వహణ..

అక్రమంగా నిర్వహణ..

కోడంబాక్కం ప్రాంతంలో కిక్ శ్యామ్‌కు ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా అక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్ లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X