twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కిక్'ని క్యాష్ చేసుకుందాం

    By Staff
    |

    Shyam
    కిక్ చిత్రం హిట్ కావటంతో ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి. 'కిక్' సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన శ్యామ్ హీరోగా తెలుగులో 'నీలో...నాలో' అనే చిత్రం రిలీజవబోతోంది. ఇందులో స్నేహ హీరోయిన్, 'బిట్వీన్ యు అండ్ మి' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వస్తోంది. నైన్త్ చానల్ పతాకంపై నందు దర్శకత్వంలో విజయశ్రీ నందకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, 'ఆనందం' ఫేమ్ రేఖ, జూనియర్ రేలంగి తదితరులు ఇత పాత్రలు పోషిస్తున్నారు.

    షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. దర్శకుడు నందు మాట్లాడుతూ, 'కిక్' శ్యామ్ నటన, స్నేహ గ్లామర్, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షలుగా నిలుస్తాయని చెప్పారు. ఈవారంలోనే మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదల చేసి నెలాఖరుకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి కృష్ణవేణి సంభాషణలు, కొత్త పల్లి రామకృష్ణ సినిమాటోగ్రఫీ, పి.బి.బాలాజీ సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X