చేపలు పట్టే వాడే ‘కిక్ శ్యామ్’
'కిక్" సినిమాలో రెండో హీరోగా చేసిన శ్యామ్ హీరోగా 'మల్లికాకపూర్" హీరోయిన్‌గా 'వీడు మనవాడే" చిత్రం రూపొందుతోంది. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నేతాజీ దర్శకత్వంలో సి.విజయకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నార. ఈ చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది.
తాజా షెడ్యూల్‌ను ఈ నెలాఖరు వరకు జరుపుతామని దర్శకుడు నేతాజీ చెప్పారు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా..తమిళంలో మరొక చిత్రం అంగీకరించడంతో ఆ చిత్రానికి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కులుమనాలి, చెన్నై, మహాబళేశ్వరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళంలో ఇటీవలే విడుదలైందని, తెలుగు వర్షన్ నేటివిటీకి తగినట్లు మళ్లీ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ముందుగా 'సిలువ నీడలో" అనే పేరు పెట్టామనీ, ఆ తర్వాత కథాపరంగా ఆలోచించి 'వీడు మనవాడే" గా పేరును ఖరారు చేశామన్నారు.
హీరో శ్యామ్ మాట్లాడుతూ తాను ఇందులో చేపలు పట్టే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు. జాలరులు నివసించే ప్రాంతాన్ని సారథిలో సెట్ గా వేశారు. అక్కడ గత కొద్దిరోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. క్రింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తిగా తన పాత్ర ఉంటుందని ఈ చిత్రం ద్వారా తనకు 'కిక్" సినిమా తర్వాత తనకు మంచి గుర్తింపు వస్తుందని శ్యామ్ ఆశించారు. ఇందులో విజయభాస్కర్ బ్లైండ్ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇంకా రామిరెడ్డి, సైరాభాను, వేణుమాధవ్, రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











