రవితేజ...సల్మాన్...ఇప్పుడు ఉపేంద్ర
బెంగళూరు : తెలుగులో హిట్టైన రవితేజ ...కిక్ చిత్రం మొన్నీ మధ్యన సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో కిక్ చూసిన వారికి నచ్చకపోయినా...కమర్షియల్ పరంగా సినిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు ఈ చిత్రం కన్నడంలోకి వెళ్తోంది. 'సూపర్ రంగ' టైటిల్ తో ఈ చిత్రం రీమేక్ అవుతోంది.

కె.మంజు సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత మంజు నిర్మిస్తున్న సూపర్ రంగ సినిమా విడుదలకు సిద్ధమైంది. డిటిఎస్ మెరుగుల్ని ఇటీవలే పూర్తి చేశారు. నెలాఖరు నాటికి తొలిప్రతి సిద్ధం కానుంది. వచ్చేనెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

ఇందులోని ఓ పాటను యూరోప్‌లో చిత్రీకరించారు. ఉపేంద్ర, కృతి కర్బంద జంటగా నటించారు. రఘు ముఖర్జీ, ప్రియాంక, దొడ్డణ్ణ, రంగాయణ రఘు, బులెట్ ప్రకాష్, దయానంద్ ప్రధాన తారాగణం. ఫోటోగ్రఫీ- అశోక్ కశ్యప్, సంగీతం- అర్జున్ జన్య, దర్శకత్వం- సాధు కోకిలా.



Click it and Unblock the Notifications











