హీరో విజయ్‌పై కిడ్నాప్ కేసు!
చిత్ర పరిశ్రమలో విడాకుల కేసులు కొత్తేమీ కాదు. కన్నడ ప్రభాకర్- జయమాల, శృతి-మహేందర్, ప్రకాశ్‌రై- లలితా కుమారి, అరవిందస్వామి- గాయత్రి తదితరులు విడాకుల్ని తీసుకుని కొత్త భాగస్వాములతో జీవితాన్ని ప్రారంభించిన వారే. చిన్న కారణాన్ని చూపి విజయ్ తన భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని నాగరత్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరో యువతిని వివాహం చేసేందుకు, తమ కుమారుడిని తమ నుంచి దూరం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు.
దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. కన్నడ మీడియా కథనాల ప్రకారం.....విజయ్ తన విడాకుల పిటీషన్లో భార్య నాగరత్న తనను మెంటల్‌గా టార్చర్ పెడుతోందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అయితే గత కొంతకాలంగా కన్నడ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం....ఓ ప్రముఖ కన్నడ నటితో దునియా విజయ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, ఈ కారణం వల్లనే అతని కాపురంలో కలతలు వచ్చాయనే మరో కోణం కూడా వినిపిస్తోంది. అయితే దునియా విజయ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. త్వరలో కోర్టు దునియా విజయ్ విడాకులపై తీర్పు వెలువరించనుంది. తన విడాకుల విషయమై మాట్లాడేందుకు దునియా విజయ్ ఇష్ట పడటం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి


Click it and Unblock the Notifications












