కికి ఛాలెంజ్ వివాదంలో బిగ్‌బాస్ సెలబ్రిటీ.. తప్పు జరిగింది.. చెంపలేసుకొని..!

By Rajababu

ప్రపంచవ్యాప్తంగా కికి ఛాలెంజ్ వివాదాస్పదమవుతున్నది. ఈ ఛాలెంజ్‌కు స్పందించిన ఔత్సాహికులు ప్రమాదాల బారిన పడటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పోలీసులు అంక్షలు విధిస్తున్నారు. డ్రేక్ రూపొందించిన స్కార్పియన్ ఆల్బమ్‌లోని ఇన్ మై ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేయడానికి ఈ ఛాలెంజ్‌‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. కదులుతున్న కారులో నుంచి దిగి డ్యాన్స్ చేయడం కికి ఛాలెంజ్‌లో భాగం. ఈ ఛాలెంజ్‌కు స్పందించి కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ సెలబ్రిటీ నివేదిత గౌడ్ పోలీసుల హెచ్చరికకు గురయ్యారు.

కిక్కిరిసిన రోడ్డుపై నివేదిత గౌడ

కిక్కిరిసిన రోడ్డుపై నివేదిత గౌడ

బెంగళూరులోని కిక్కిరిసిన రోడ్డుపై కారులో నుంచి దిగి నివేదిత డ్యాన్స్ చేసి కికి ఛాలెంజ్‌కు స్పందించింది. ఆ తర్వాత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో లోడ్ చేసింది. అంతేకాకుండా మీరు కూడా కికి ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నివేదిత వ్యవహారంపై సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు.

నివేదిత గౌడపై విమర్శలు

నివేదిత గౌడపై విమర్శలు

నివేదిత కిక్కిరిసిన రోడ్డుపై బాధ్యతారాహిత్యంగా డ్యాన్స్‌ చేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఛాలెంజ్‌పై పోలీసులు కఠినంగా వ్యవహారించాలి అని సోషల్ మీడియాలో నెటిజన్లు, సాధారణ ప్రజలు తీవ్రంగా స్పందించారు. దాంతో నివేదితకు షాక్ తగలడంతో ఆమె ఈ వివాదంపై స్పందించక తప్పలేదు.

తెలియక తప్పు చేశాను

తెలియక తప్పు చేశాను

ఇన్‌స్టాగ్రామ్‌లో కీకీ ఛాలెంజ్‌ వీడియో చూసి సరదాగా ప్రయత్నించా. కికి ఛాలెంజ్‌ను నిషేధించిన విషయం తెలియదు. ఈ విషయం తెలియక తప్పు చేశాను. నాపై విమర్శలు వస్తున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. వివాదం గురించి తెలిసిన తర్వాత మరొకరు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను తొలగించాను అని నివేదిత మీడియాకు వెల్లడించింది.

నేను మూర్ఖురాలిని కాదు

నేను మూర్ఖురాలిని కాదు

కికి ఛాలెంజ్‌కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని నేను కాదు. ఈ వివాదంలో నన్ను అర్థం చేసుకొని క్షమించండి అని నివేదిత ప్రాధేయపడింది. 18 ఏళ్ల నివేదిత గౌడ కన్నడ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా మంచి ప్రజాదరణను సంపాదించుకున్నారు. కీకీ ఛాలెంజ్‌ విమర్శల నేపథ్యంలో మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది.

రెజీనా కూడా కికి ఛాలెంజ్

రెజీనా కూడా కికి ఛాలెంజ్

ఇటీవల రెజీనా కసండ్రా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నది. వెస్ట్రన్ బీట్‌తో కేకపుట్టించే సాంగ్‌లో రెజీనా సంప్రదాయ దుస్తుల్లో అలరించింది. లంగా, ఓణిలో అందంగా కనిపించడమే కాకుండా.. సెప్టులతో అదరగొట్టింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ తన్మయత్వంతో మురిసిపోయింది. తన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X