సిద్దార్ధ, తమన్నా కాంబినేషన్ లో కిషోర్ కుమార్ అనే నూతన దర్శకుడు రూపొందించిన కొంచెం ఇష్టం..కొంచెం కష్టం పిభ్రవరి ఐదున రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే శంకర్-ఇషాన్ లయ్ కంపోజ్ చేసిన పాటలు అన్ని చోట్లా మారుమ్రోగుతున్నాయి. నల్లమలుపు బుజ్జి నిర్మించిన ఈ చిత్రంపై ట్రేడ్ లో మంచి అంచలాలు ఉన్నాయి. అందులోనూ సిద్దార్ధ బొమ్మరిల్లు చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేయటంతో అతని అభిమానులు కూడా ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. రొమాంటిక్ కామిడీగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం.