'కొంచెం ఇష్టం-కొంచెం కష్టం'కధ

విశ్వసనీయ సమాచారం ప్రకారం కథలో ఎంబిఎ చదువుకున్న సిద్దు(సిద్దార్ధ)సరదాగా తిరుగుతూ అమ్మాయిలకు సైట్ కొట్టుకుంటూ..లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఇక గీత(తమన్నా) ఓ జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన చదువుకోసం సిటీకి వచ్చినప్పుడు అక్కడ సిద్దు పరిచయవుతాడు. మొదట ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. కానీ తర్వాత తమన్నా తన పల్లెకు వెళ్ళాక తను ప్రేమలో ఉన్నానని గమనిస్తుంది. దాంతో తన తండ్రి సుబ్రమణ్యం (నాజర్)దగ్గరకు సిద్దుని తీసుకెళ్ళి పెళ్ళి ప్రపోజల్ పడుతుంది.
అయితే అప్పుడాయన సిద్దు కుటుంబం గురించి ఓ ప్రశ్న అడుగుతాడు. మీ తల్లి,తండ్రి(ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ) విడిపోయి ఉన్నారు కదా...వాళ్ళని కలపటానికి ఎప్పుడైనా ప్రయత్నించావా అని. అలాంటి కుటుంబానికి కోడలుగా నా కూతర్ని ఎలా పంపమంటావంటూ నిలదీస్తాడు. అప్పుడు సిద్దార్ధ ఏ నిర్ణయం తీసుకున్నాడు..ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడనేది మిగతా కథ అని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న దర్శకుడు కిషోర్ కుమార్(డాలి)గతంలో రవితేజ..భగీరధ చిత్రానికి కథ అందించాడు. అలాగే ఈ చిత్రం కథ మొత్తం టైటిల్లోనే ఉందంటున్నాడు. మన కావల్సింది(ఇష్టం)పొందాలంటే కొంత చెల్లించాల్సి ఉంటుంది(కష్టం)...గులాబి పట్టుకోవాలంటే క్రింద ముళ్ళు గుచ్చుకున్నా భాధభరించాలి అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అంటున్నారు.
అలాగే ఈ చిత్రపై మరిన్ని వివరాలు కావాలంటే...నిర్మాతలు కిక్‌దిఫిల్మ్.కామ్(kikkthefilm.com) పేరుతో రూపొందించారు చూడచ్చు. ఈ వెబ్‌సైట్‌ను అనుష్క ఆవిష్కరించింది. అలాగే ఈ సినిమాను పిబ్రవరి ఐదవ తేదీ ఉదయం ఆటతో కాకుండా మధ్యాహ్నం సరిగ్గా 1గంట 1నిమిషానికి విడుదల చేస్తున్నామని, రాష్టవ్య్రాప్తంగా అన్ని ధియేటర్లలోనూ ఇదే సమయానికి సినిమా ప్రారంభమవుతుందని నిర్మాత బుజ్జి ప్రకటించారు.సిద్దార్ద ఆట సినిమా అనంతరం చేస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











