twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాటలు రావడంలేదు, చంపేయడమే మంచిది.. మోడీ ఎమోషనల్ ఫొటోతో మంచు మనోజ్!

    |

    పుల్వామా ఉగ్ర దాడి ప్రతి భారతీయుడిలో ఆగ్రహావేశాలని రగిలిస్తోంది. ఇండియా ఎంతగా శాంతి మాత్రం జపించినా పాకిస్తాన్ కుట్రలతో, ఉగ్ర దాడులతో రెచ్చిపోతోంది. పుల్వామా ఘటనతో 40 మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంట్లో పాక్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులు జరిపి 40 మంది భారత జవాన్లని పొట్టనబెట్టుకున్నారు. దేశం మొత్తంఉగ్రవాదుల పైశాచికత్వాన్ని, పాక్ చర్యలని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు అందరూ ఈ ఘటనపై స్పందిస్తూ మరణించిన జవానులకు నివాళులు అర్పిస్తున్నారు.

    మోడీ ఎమోషనల్ ఫోటో

    మోడీ ఎమోషనల్ ఫోటో

    ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర భావోద్వేగంతో అమరులైన వీర జవానులు భౌతిక కాయాలకు నివాళులు అర్పిస్తున్న ఫోటోని సినీ హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదులు పుల్వామాలో ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ జవానుల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడులు జరపడంతో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ప్రజలు, సెలెబ్రిటీలు అందరూ వీర జవానులకు నివాళులు అర్పిస్తూనే ఇండియా తగిన ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.

    చంపేయడమే మంచిది

    పుల్వామా ఘటనపై మనోజ్ తాజాగా స్పందిస్తూ.. అమరవీరుల భౌతిక కాయలు చూస్తుంటే భాదని వర్ణించడానికి మాటలు రావడం లేదు. జరిగిన నష్టానికి దేశం మొత్తం రోదిస్తోంది. తిరిగి వాళ్ళని చంపడం సరైన ఆప్షన్ కాదు. కానీ చావడం కంటే చంపేయడమే బెటర్ అని మనోజ్ ట్వీట్ చేశాడు. 2016లో జరిగిన యురి ఘటనకు తగిన బుద్ది చెప్పినా పాక్ తీరు ఇంకా మారలేదు.

    సినీప్రముఖులంతా

    సినీప్రముఖులంతా

    టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇప్పటికే ఉగ్ర దాడిని ఖండించారు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, నితిన్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కాజల్ అగర్వాల్, రవితేజ ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా పుల్వామా ఉగ్ర ఘటనపై స్పందిస్తూ మరణించిన వీర జవానులు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

    అనాగరిక చర్య

    అనాగరిక చర్య

    సూపర్ స్టార్ రజనీకాంత్ పుల్వామా ఘటన గురించి మాట్లాడుతూ ఇలాంటి అనాగరిక చర్యలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఈ దాడిని ఖండిస్తున్నా. నా మనసుప్రాణాలు కోల్పోయిన, గాయపడిన జవానుల చుట్టూ తిరుగుతోందని రజనీకాంత్ అన్నారు. ఇక ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాధ్ మాట్లాడుతూ మన ఈ రోజు కోసం జవాన్లు వాళ్ళ రేపటిని త్యాగం చేశారు. మరో సర్జికల్ స్ట్రైక్ కావాలి. పాక్ లోకి దూరి వాళ్ళని కొట్టి రావాలి అని అన్నారు.

    English summary
    Killing them back is not a good option, but it’s better than to be killed says Manchu Manoj
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X