»   »  తొలగిన అడ్డంకి: వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ ఖరారైంది

తొలగిన అడ్డంకి: వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' డిసెంబర్ 4న విడుదల కావాల్సి ఉండగా అగిపోయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి కోర్టు పిటీషన్. అయితే చివరి నిముషాల్లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి వలన ఏర్పడిన సమస్యలను సెట్ చేసుకున్నారు.

ఇపుడు ఈ సినిమా అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు వర్మ ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేసారు. ‘లీగల్ సమస్యలు తొలగిపోయాయి, సెన్సార్ కూడా పూర్తయింది. కిల్లింగ్ వీరప్పన్ జనవరి 1న విడుదల చేస్తున్నాం' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

ఇబ్బంది పెట్టిన వీరప్పన్ భార్య...
ఈ సినిమాలో వీరప్పన్ ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు. 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.

Killing Veerappan releasing on January 1st

ఈ సినిమా గురించి వర్మ గత ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాలు...
''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము'' అని వర్మ అంటున్నారు. ''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు.

English summary
"Now that all the legal cases and censor formalities are completely sorted "Killing Veerappan" is for sure releasing on January 1st" RGV tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu