హవ్వ! బ్రా లేకుండా హాట్ బ్యూటీ హల్ చల్!
లాస్ ఏంజిల్స్: సంచలనాలకు మారుపేరైన హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్ధాషియాన్ మరోసారి తన సెక్సీ ఒంపు సొంపులను ప్రదర్శనతో అభిమానులకు కనువిందు చేసింది. ఈ సారి ఏకంగా బ్రా లేకుండా హల్ చల్ చేసింది. తన భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి డేట్‌కు వెళ్లిన కిమ్ కర్దాషియాన్ ఇలా రొమాంటిక్ లుక్‌తో కనిపించింది.
వెస్ట్ హాలీవుడ్ ప్రాంతానికి తన భర్త కెన్నీ వెస్ట్‌తో కలిసి వెళ్లిన కిమ్ కర్ధాషియాన్ గ్రే కలర్ స్కిన్ టైట్ టాప్ ధరించింది. అయితే ఆమె బ్రా ధరించక పోవడంతో ఉల్లిపొరలాంటి ఆ టాప్ నుండి ఆమె ఎద అందాలు బట్టబయలయ్యాయి. కిమ్ కర్ధాషియాన్ ఇలా చేసిన విషయం ఇపుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

పబ్లిసిటీ కోసమే కిమ్ కర్ధాషియాన్ ఇలా చేసిందనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయినా ఇలాంటి చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. ఇటీవల కొన్ని రోజుల క్రితమే బ్రిటిష్ మేగజైన్ ‘జిక్యూ' కోసం హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసింది. తనను అభిమానించే ఫ్యాన్స్ కోసమే ఇదంతా అంటోంది కిమ్.
కిమ్ కర్ధాషియాన్, కన్నీ వెస్ట్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కిమ్ ఏ పని చేసినా ఆమెకు తన పూర్తి మద్దతు ప్రకటించడం కెన్నీ వెస్ట్‌కు అలవాటు. ఇటీవల జిక్యూ మేగజైన్ కోసం కూడా ఈ ఇద్దరూ కలిసి హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చారు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లనే ఇద్దరూ అన్యోన్యంగా రొమాంటిక్ లైఫ్ సాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











