బాలీవుడ్‌కు బాయ్ చెప్పనున్న భామ
బాలీవుడ్‌కు ప్రముఖ నటి కిమ్ శర్మ్ గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలీ పుంజానిని కిమ్ శర్మ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవల ఈ విషయంపై మాట్లాడుతూ నేను చాలా అనందంగా పెళ్లి చేసుకున్నానని, లక్కీగా మరియు సంతోషంగా తన సినీ కెరిర్‌ను ముగిస్తానని చెప్పారు. దీంతో ఆమె ఆఖరి చిత్రం లూట్ అయ్యే అవకాశముంది. గత సంవత్సరం అలీ పుంజానిని కిమ్ శర్మ రహస్యంగా పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇక నుండి ఆమె కెన్యాలోని ముంబాసా, దుబాయ్, ముంబయిలలో గడపనుంది.
కిమ్ 2000వ సంవత్సరంలో మొహబ్బతే చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, ఉదయ్ చోప్రా తదితరులు నటించిన ఈ చిత్రంలో కిమ్ సంజన పాత్ర పోషించింది. ఈ చిత్రం హిట్ కావడంతో ఆమె హిందీలో బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిల్, ఉర్దూ చిత్రాల్లోనూ నటించింది.


Click it and Unblock the Notifications











