Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
బికినీ ఫోటోలతో రచ్చ.. అందాలను ఆరబోస్తోన్న హీరోయిన్లు
సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంటారు కొందరు సుందరీమణులు. వెండితెరపై అందాలను ఆరబోసి ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిచ్చే అవకాశాలు లేకున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిల్లో అందాల ఎర వేస్తుంటారు. ఇలా సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్‌ను నిత్యం ఆకట్టుకుంటూ.. ఫుల్ క్రేజ్ సంపాదిస్తుంటారు. తాజాగా కొందరు హీరోయిన్లు బికినీ ఫోటోలతో అందాలను చూపిస్తూ అభిమానులకు గాలమేస్తున్నారు.
|
ముసుగు వేయోద్దు..
ముసుగు వేయోద్దు మనసు మీద.. అనే పాట వింటే ఎవరికీ హాట్ హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఖడ్గం ముద్దుగుమ్మ కిమ్ శర్మ గుర్తుకువస్తుంది. మగధీర సినిమాలోనూ రామ్ చరణ్‌తో కలిసి చిందులు వేసిన ఈ భామ.. తాజాగా బికినీ ఫోటోను షేర్ చేసింది. చిటారు కొమ్మను పట్టుకుని తన సోయగాలను చూపిస్తోన్న ఫోటోనే షేర్ చేసి... ఫ్యాన్స్‌కు వేడి పుట్టిస్తోంది.
|
బీచ్‌లో అందాల విందు..
కొమురం పులి చిత్రంలో మెరిసిన నికిషా పటేల్.. ఆపై అంతగా కనిపించకుండాపోయింది. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేసిన నికిషా.. భారీగానే అభిమానగణాన్ని మూటగట్టుకుంది. తాజాగా బికీనీలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాకు కునుకులేకుండా చేస్తోంది.
|
ఒంటరిగా బికినీలో..
సినిమాల కంటే.. లోదుస్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది లోఫర్ భామ దిషా పటానీ. టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం కూడా ఈ భామను ఫుల్ ఫేమస్ అయ్యేలా చేసింది. తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద ఒంటరిగా బికినీ ధరించి కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.
Recommended Video
హాట్ హాట్ ఫోటోలతో దాడి..
హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు, ప్రస్తుతం అంతగా పాపులారిటీ లేని నటీమణులు ఇలా హాట్ హాట్ ఫోటోలతో దాడి చేస్తుంటారు. తద్వారా అందరి దృష్టి తమ మీద పడుతుందని అనుకుంటారు. అంతేకాకుండా వారి ఫాలోవర్స్ లిస్ట్ పెంచుకునేందుకు బికినీ ఫోటోలు అంటూ మరో ఎత్తుగడ వేస్తుంటారు. ఇలా వేడి పుట్టించే ఫోటోలను షేర్ చేస్తూ.. వారి అభిమానులను ఖుషీ చేస్తుంటారు.