హీరోయిన్‌తో యువరాజ్ నైట్ పార్టీ.. భార్యను పక్కనే పెట్టుకొని
పలు క్రికెట్ మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత యువరాజ్ సింగ్ సొంతం. కీలక సమయాల్లో తన బ్యాట్ పవరేంటో చూపించి ఎన్నో విజయాలను భారత జట్టు ఖాతాలో వేశారు యువరాజ్ సింగ్. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా అంతకు మించి ఫీల్డర్‌గా అద్భుతాలు సృష్టించిన యువరాజ్ సింగ్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఏ ఫార్మాట్ లోనూ ఆడనని ప్రకటించిన యువరాజ్ సింగ్ తన సన్నిహితులతో వీడ్కోలు సమావేశం ఏర్పర్చుకొని గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీలో యువీ మాజీ ప్రేయసి నటి కిమ్ శర్మ దర్శనమివ్వడం, ఆమెతో కలిసి యువీ ఎంజాయ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

బాలీవుడ్ భామలతో డేటింగ్స్, షికార్లు
క్రికెట్ ఆట సంగతి అటుంచితే బాలీవుడ్ భామలతో డేటింగ్స్, షికార్లు అన్నింటిలోనూ యువీ ఫుల్ ఫేమస్. దాదాపు ఏడుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో ఆయన చెట్టాపట్టాలేసుకు తిరిగాడనే రూమర్స్ ఉన్నాయి. ఆ లిస్టులో ఒకరే కిమ్ శర్మ. ఈ బాలీవుడ్ బ్యూటీతో ఒకప్పుడు యువీ పీకల్లోతు ప్రేమ మత్తులో మునిగితేలారు. చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత ఈ ఇద్దరి రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది.

వీడ్కోలు పార్టీలో మాజీ ప్రేయసితో..
కాగా ఇటీవల జరిగిన యువీ వీడ్కోలు పార్టీలో బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ తెగ సందడి చేసింది. యువరాజ్‌తో కలిసి పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. యువరాజ్, కిమ్ శర్మ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగటంతో ఈ పార్టీలో వీరి హవానే ఎక్కువగా కనిపించింది. దీంతో మాజీ ప్రేయసితో మరోసారి యువీ అంటూ ఈ ఇద్దరి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

భార్యను పక్కనే పెట్టుకొని ఆమెతో
యువరాజ్ ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు పార్టీకి ఆయన భార్య హెజల్ కిచ్‌తో పాటు పలువురు టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. పార్టీలో భాగంగా ఓ పక్క భార్య హెజల్ కిచ్, మరోపక్క మాజీ ప్రేయసి కిమ్ శర్మలతో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు యువరాజ్. వారి భుజాలపై చేతులు వేసి ఆ ఇద్దరి మద్య నిల్చుని యువీ కనిపించాడు. గతంలో యూవీ, కిమ్ శర్మ లవర్స్ కావడంతో ఈ ముగ్గురి తాలూకు ఈ పిక్ పలు చర్చలకు దారి తీస్తోంది.

యువరాజ్ గుడ్ బై చెప్పిన సమయంలో కిమ్ శర్మ రియాక్షన్
జూన్ 10 వ తేదీన యువీ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన సమయంలో కిమ్ శర్మ రియాక్ట్ అయింది. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె యూవీ ఇన్నాళ్లు అద్భుతమైన ఆట తీరును కనబర్చాడని, గ్రౌండ్‌లో ఆయన ఆట.. అలాగే నెలకొల్పిన రికార్డులు ఏ నాటికీ మరువలేనివని ఆమె పేర్కొంది. హేజల్ కీచ్‌తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నానని కిమ్ శర్మ పేర్కొంది.


Click it and Unblock the Notifications











