Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నా వద్ద డబ్బే లేకుంటే...ఇలా ఎంజాయ్ చేయగలనా? హీరోయిన్ ఫైర్!
భర్త వదిలేయడంపై కిమ్ శర్మ స్పందించలేదు కానీ, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అంటూ మీడయా రాసిన రాతలపై ఆమె భగ్గుమన్నారు. తన దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారని ప్రశ్నించింది.
ముంబై: తెలుగులో 'ఖడ్గం' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించిన కిమ్ వర్మ గుర్తుందా? ఆమెపై ఇటీవల కొన్ని షాకింగ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అలీ పంజానీ వివాహం చేసుకున్న కిమ్ శర్మ.... భర్త వేరే మహిళ మోజులో పడి ఆమెను వదిలేసాడని, ప్రస్తుతం ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఇబ్బంది పడుతోందంటూ ప్రచారం మొదలైంది.
|
నా వద్ద డబ్బు లేకుంటే ఇలా ఎంజాయ్ చేయగలనా?
అయితే... భర్త వదిలేయడంపై కిమ్ స్పందించలేదు కానీ, తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు అంటూ మీడయా రాసిన రాతలపై ఆమె భగ్గుమన్నారు. తన దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారని ప్రశ్నించింది. వీకెండ్ థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేసి వస్తుంటే... నా చేతిలో చిల్లిగవ్వ లేదని రాసేస్తున్నారంటూ మండిపడింది.
మీడియాపై మండి పాటు
నా గురించి నా కంటే వారికే ఎక్కువ తెలిసినట్టు రాస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని నేను పట్టించుకోను... ఏమైనా రాసుకోండి అంటూ ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించింది కిమ్.
భర్తతో ఉన్నట్టా లేనట్టా?
కెన్యాలో స్థిరపడ్డ వ్యాపారవేత్త అలీ పంజానీని 2010లో కిమ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలీ ఇప్పుడు వేరే అమ్మాయి మోజులో పడి కిమ్ ను వదిలేశాడని టాక్. ప్రస్తుతం కిమ్ ముంబైలోనే ఉంటోంది. అయితే దీనిపై మాత్రం అమ్మడు స్పందించలేదు.
సినిమాలు లేవు
ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన కిమ్ శర్మ వయసు పైబడటంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేవు. అందుకే ప్రస్తుతం ముంబైలో ఏదైనా బిజినెస్ చేస్తూ ఎదిగేందుకు ప్లాన్ చేసుకుంటోంది.