'కింగ్'గురించి..

ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ అనే సరికి అంచనాలు మరింత పెరిగాయి. ఇన్ని అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాని అత్యంత సన్నిహితుడు డి.శివప్రసాద్‌రెడ్డి తమ శ్రీకామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మించారు.ఈ సినిమా గురించి శ్రీనువైట్ల మాట్లాడుతూ ...ఇందులో అభిమానులందరూ ఓ కొత్త నాగ్‌ని చూస్తారు. ఎందుకంటే ఆయనలో ఓ క్లాస్ హీరో ఉన్నాడు. ఓ మాస్ హీరో ఉన్నాడు. రాజఠీవీ వొలికించే హీరో ఆయన. ఈ మూడు కోణాల్ని ఈ చిత్రంలో ఆవిష్కరించాం. త్రిష. మమత పాత్రకూ ప్రాముఖ్యం ఉంది. అవే కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్రా ముఖ్యమైనదే. ముఖ్యంగా శ్రీహరి పోషించిన జ్ఞానేశ్వర్ పాత్ర. 'ఢీ'లో మాదిరే కలకాలం గుర్తుండిపోతుంది.


Click it and Unblock the Notifications











