అలా చేస్తేనే మరింత ఉత్సాహాన్ని గ్లామర్ ను పెంచుకోవచ్చు...!?
క్యారెక్టర్ నటి హేమ చాలా హాషారుగా ఉంటుంది. అందుకే ఈ ఆంటీని మా" టీవి లో ప్రసారమైన 'టాలీవుడ్ హంగామా" అనే ప్రొగ్రామ్ కు యాంకర్ గా తీసుకుని ఉంటారు. ఈ బుల్లితెర ప్రోగ్రామ్ కు యాంకర్ గా తీసుకుని ఉంటారు. ఈ బుల్లితెర ప్రోగ్రామ్ లో నాగార్జున అతిథిగా పాల్గొన్నాడు. తను కాకుండా పలువురు కుర్ర అమ్మాయిలు కూడా ఈ షోలో పాల్గొన్నారు. హేమ తన వాక్ఛాతుర్యంతో నాగార్జునను ఆకట్టుకుంది. ఈ హుషారు ఆంటీ..ఆ కుర్ర అమ్మాయిలతో నాగార్జున ఈ ప్రోగ్రామ్ ను బాగా ఎంజాయ్ చేశాడు. హేమ ఈ ప్రోగ్రామ్ ను అధ్భుతంగా నిర్వహించిందని పొట్ట చెక్కలయ్యేంతగా నవ్వానని నాగార్జున పేర్కొన్నాడు. అంతే కాకుండా హేమ అడిగిన ప్రశ్నలకు సింపుల్ గా సమాధానమిచ్చేశాడు. అందులో గాసిప్స్ గురించి మాట్లాడుతూ గాసిప్స్ అంటే తనకు చాలా ఇష్టమట అవే తనకు మరింత ఉత్సాహాన్ని, గ్లామర్ ను పెంచుతుందన్నారు. అవే అబ్బాయిలు గ్లామర్ గా ఉండటానికి పెద్ద రహస్యం అన్నారు.


Click it and Unblock the Notifications











