ఎన్టీఆర్ ఇంటి ముందు 4 నెలలు.. ఫ్లైట్‌లో వాళ్ళు తాగేసి ఉంటే రష్మిక కొట్టింది.. నాగార్జున
Recommended Video

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. సెప్టెంబర్ 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఆడియో వేడుకని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు నాగ్, నానితో పాటు సమంత, అఖిల్ హాజరయ్యారు. ఆడియో వేడుకలో నాగార్జున ప్రసంగం ఆకట్టుకుంది.చాలా సరదా మాట్లాడిన నాగార్జున అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం
ఈ సినిమాని ఒప్పుకోవడానికి 3 కారణాలు ఉన్నాయని నాగార్జున తెలిపారు. శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ ఓ కారణం అయితే ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండడం మరో కారణం అని నాగార్జున అన్నారు. మరో హీరో నాని అనగానే సినిమాకి ఇక తిరుగులేదని భావించా అని నాగార్జున అన్నారు.

తండ్రిని గుర్తు చేసుకుంటూ
ఈ ఆడియో వేడుక ఏఎన్నార్ జయతి రోజు జరగడంతో నాగార్జున తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రం విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత కూడా ఈ దేవదాస్ విడుదలవుతోంది. ఏఎన్నార్ జీవించే ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం అని నాగార్జున తెలిపాడు.

ఎన్టీఆర్ ఇంటి ముందు
అశ్విని దత్ గురించి మాట్లాడుతూ.. ఒక సీత కథ చిత్రం విడుదలయ్యే సమయానికి అశ్వినీదత్ గారికి 24 ఏళ్లు. ఉదయాన్నే 4 గంటలకు వెళ్లి పెద్దాయన ఎన్టీఆర్ ఇంటిముందు నిలబడేవారు. అలా నాలుగు నెలలు ఎదురుచూసిన తరువాత అశ్వినీదత్ కి ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్రాన్ని ఇచ్చారు. వైజయంతి మూవీస్ అని పేరు పెట్టింది కూడా ఎన్టీఆరే.

ఐశ్వర్యారాయ్‌ని తీసుకొచ్చారు
వైజయంతి మూవీస్ లో అత్యధిక చిత్రాలు చేసిన హీరో తానే అని నాగార్జున అన్నారు. ఆఖరి పోరాటం చిత్రం కోసం శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకుని వచ్చారు. రావోయి చందమామ చిత్రంలో కేవలం ఒక సాంగ్ కోసం ఐశ్వర్యారాయ్ ని తీసుకుని వచ్చారు.

మల్టీస్టారర్ చేస్తే
మల్టీస్టారర్ చిత్రం చేస్తే నానితో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని నాగార్జున అన్నారు. నాని డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. నాని వంక చూస్తూ ఈ చిత్రానికి సీక్వెల్ చేద్దామా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

థాయిలాండ్ నుంచి వస్తుంటే
షూటింగ్ పూర్తి చేసుకుని రాత్రి విమానంలో థాయిలాండ్ నుంచి వస్తున్నాం. రాత్రి ప్రయాణం కాబట్టి చాలా మంది మందేసి ఉన్నారు. ఆ సమయంలో రష్మిక నా పక్కనే కూర్చుంది. మందేసి వాళ్ళు గోల చేస్తుంటే నాకు బాడీ గార్డ్ గా మారింది. వాళ్ళని రెండు దెబ్బలు కొట్టింది కూడా అంటూ నాగార్జున రష్మిక గురించి ఫన్నీ కామెంట్స్ చేశాడు.

చాలా అరుదు
ఈ ఈవెంట్ కు హాజరైన సమంతని ఉద్దేశించి నాగార్జున మాట్లాడారు. భార్య భర్తలు నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం చాలా అరుదు. ఆలా విడుదలై రెండు మంచి విజయాలు సాధించడం ఇంకా అరుదు అని నాగార్జున అన్నారు. శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్ రెండు చిత్రాలు బాగా ఆడాయి.

సమంతకు టెన్షన్
సెప్టెంబర్ 13 ఉదయాన్నే సమంత శైలజారెడ్డి అల్లుడు రివ్యూలు చూసుకుని చాలా టెన్షన్ పడింది. ఏం పరవాలేదమ్మా సాయంత్రానికి అన్నీ ఒకే అవుతాయని చెప్పా. అన్నట్లుగానే రెండు చిత్రాలకు మంచి వసూళ్లు వచ్చాయని నాగార్జున గుర్తు చేశారు. యూ టర్న్ చిత్రం కూడా మంచి విజయం సాధించిందని అన్నారు.


Click it and Unblock the Notifications











