మన్మథునితో రొమాన్స్ చేయడానికి ఆ సెక్సీబ్యూటీ రెడీ అంటుందా...!?
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ తోనూ జతకట్టి తన అభిమానులను అలరించాలనుకునే మన 'మన్మథుడు" నాగార్జున ఇప్పుడు ఇలియానా పై దృష్టి సారించారు. ఇప్పటివరకూ ఇలియానాతో కాంబినేషన్ కుదరని నాగార్జున త్వరలోనే తాను చెయ్యనున్న ఓ చిత్రానికి ఆమెని హీరోయిన్ గా పెట్టుకునే ఆలోచనలో వున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇలియానాతో సంప్రదింపులూ మొదలయ్యాయి. ప్రస్తుతం విక్రమ్ తో 'వేడి"గా రొమాన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో మరోసారి 'జల్సా" చేసేందుకు అంగీకారం తెలిపిన ఇలియానా మన్మథుని పిలుపుకీ సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నాయండోయ్..


Click it and Unblock the Notifications











