శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున, త్రిష కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం 'కింగ్'. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (జూన్ 6న) సారథీ స్టూడియోస్‌లో మొదలవుతోంది. 'బాస్' తర్వాత శ్రీ కామాక్షి కళామూవీస్ బానర్‌పై డి. శివప్రసాద్‌రెడ్డి నాగార్జునతో నిర్మిస్తున్న సినిమా ఇది. గోపీ మోహన్ మాటలు రాస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైందని నాగార్జున పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్. లారెన్స్ తో చేసిన 'డాన్' ఆశించిన రీతిలో ప్రేక్షకులని అలరించక పోవడంతో ఆ లోటును 'కింగ్' తీరుస్తాడని నాగార్జున ఆశిస్తున్నారు. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా 'ఢీ' రేంజిలో నవ్విస్తుందని 'హలో బ్రదర్' తరువాత నాగార్జున నటిస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడి చిత్రమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు.