కింగ్ ఫిషర్ క్యాలెండర్-2015 ఫస్ట్ లుక్ (హాట్ ఫొటోలు)
హైదరాబాద్ : సంవత్సరం ప్రారంభంలో అందరూ కొత్త క్యాలెండర్స్ పై మక్కువ చూపుతూంటారు. అయితే సంవత్సరమంతా ఆసక్తి చూపే క్యాలెండర్ ఉంటుందా...ఉంది..అదే కింగ్ ఫిషర్ క్యాలెండర్. కింగ్ ఫిషర్ క్యాలెండర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలతో సర్వాంగ సుందరంగా రూపొందించే కేలండర్. ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించడం విజయ్ మాల్యా ప్రత్యేకత. 2015 కు కూడా అలాంటి కసికసి అందాలతో ఓ క్యాలెండర్ రూపొందించారు.
https://www.facebook.com/TeluguFilmibeat
దశాబ్దకాలంగా ఇది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాలండర్ తయారు చేయడం ఆయన హాబీ. ఆ భామలతో భుజాలు భుజాలు కలిపి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆయనకు మహా సరదా. కింగ్ ఫిషర్ కేలండర్ 2015 అందాల భామలను ఈ ఏడాది ఆయనే ఎంపిక చేశారు. అంతేకాదు..మనల్ని ఆ క్యాలెండర్ భామల్లో ఎంపిక చేయమని ఓటింగ్ సైతం పెట్టారు. మీకూ ఓటేయాలని ఉంటే ఈ లింక్ కు వెళ్లండి.
http://kingfishercalendar.com/2015voting/
2015 నాటి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫస్ట్ లుక్ బయిటకు వచ్చింది. సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్ అతుల్ రీసెంట్ గా తన ఫొటో షూట్ లోని నాలుగు ఫోటోలను విడుదల చేసారు. వీరిలో ఒకరిని కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి కవర్ పేజీకి ఎంపిక చేస్తారు. మీరూ ఓటేసి ఆమెను ఎన్నుకోవచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఆ ఫొటోలు స్లైడ్ షోలో...

అప్పటినుంచీ...
విజయ్ మాల్యా యాజమాన్యంలోని యునైటెడ్ బ్రూబరీస్ గ్రూప్ 2003నుండి ఈ క్యాలెండర్ ను ప్రచురిస్తోంది. దాదాపు రెండు వందల మంది నుంచి వివిధ పరీక్షల ద్వారా 12మందిని ఎంపిక చేస్తారు.

కోట్లు కుమ్మరిస్తారు
ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు. మోడలింగ్, సినిమా రంగాలలోకి వెళ్లాలనుకునేవారికి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అందుకే అంత డిమాండ్
వారు చాలా తేలికగా మోడలింగ్, చిత్రపరిశ్రమలో అడుగుపెట్టగలరు. వారిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. సినీ, దర్శక, నిర్మాతలు కూడా ఈ కేలండర్ కు ఎంపికయ్యేవారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు.

వీరంతా...
కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే.

చక్కని వేదిక
ఈ భామల శరీరారకతులను వివిధ భంగిమలలో తమతమ కెమెరాలో బంధించడానికి పోటీపడతారు. వారి నైపుణ్యాన్ని క్రియేటివిటీని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వారికి ఇది ఒక వేదిక. తాజాగా 2015 కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం కూడా అందమైన అమ్మాయిలు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











