పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునే అంశాలు మెండుగా...
''ఈ చిత్రం చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునే అంశాలు మెండుగా ఉన్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది"" అని విష్ణువర్థన్ అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ హీరోగా సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై.లిమిటెడ్ ఆధ్వర్యంలో నీలిమ, శోభు సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియా నాయికలుగా నటిస్తున్నారు.
ఈ నెల 6 నుంచి ఈ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ- ''ప్రస్తుతం చేస్తున్న ఈ షెడ్యూల్ జూన్ 26 వరకూ ఏకధాటిగా సాగుతుంది. దాంతో 70 శాతం టాకీపార్ట్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికిఒక పాట రికార్డు అయ్యింది.
ఆ పాటను కోల్‌కతాలోనే చిత్రీకరిస్తాం. పవన్‌కళ్యాణ్ యాక్షన్, విష్ణువర్థన్ స్టయిల్ ఆఫ్ మేకింగ్‌తో ఈ సినిమా తయారవుతోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటిస్తాం "" అని తెలిపారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే - రాహుల్ కోడా, కెమెరా- పి.ఎస్.వినోద్, కూర్పు- ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్- శ్యామ్ కౌశల్, కళ- సునీల్‌బాబు.


Click it and Unblock the Notifications











