మహేష్ ఫ్యాన్ తో పవన్ ఫ్యాన్ లవ్వంటా
హైదరాబాద్ : హీరోలుకు అభిమానులు ఉండటం,వారు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు కానీ ఆ టాపిక్ నే ప్రధానాంశంగా చేసుకుని సినిమాలు రావటం మాత్రం కొత్తే. అలాంటి ఓ చిత్రమైన నేపధ్యంలో రూపొందిన ‘కిరాక్' చిత్రం ఈ రోజు థియోటర్స్ లో దిగుతోంది.
కన్నకూతురు తప్పిపోతే తల్లి పడే ఆవేదన, పవన్‌కల్యాణ్ అభిమాని, మహేశ్ అభిమాని అయిన ఓ యువతిని ప్రేమించాలనే ఆలోచన, 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన పాప ఎక్కడుందో కనుక్కోవడానికి హీరో చేసే ప్రయత్నం... ఈ మూడు అంశాల కలయికే ‘కిరాక్' చిత్రం. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది.
దర్శకుడు మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్ అభిమాని అయిన ఓ అబ్బాయికీ, మహేష్ అభిమాని అయిన ఓ అమ్మాయికీ మధ్య సాగే కథే ఈ చిత్రం. ఆ ఇద్దరూ ప్రేమలో పడిన వైనం ఎలాంటిదో తెరపైనే చూడాలి. వినోదంతో పాటు థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉంటాయి'' అన్నారు.
''ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. 'కాళిచరణ్' చిత్రంతో ఆకట్టుకున్న చాందిని అభినయం ఇందులో మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది'' అన్నారు నిర్మాతల్లో ఒకరైన డి.గోపికృష్ణ.

బ్యానర్ : హిట్ టాక్ పిక్చర్స్ సంస్థ
నటీనటులు: అనిరుద్ధ్, చాందిని , పడమటలంక నవీన్, అశోక్ వర్దన్, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ తదితరులు
మాటలు: డాక్టర్ ఆర్.,
ఫొటోగ్రఫీ: బి.దుర్గాకిశోర్,
సంగీతం: అజయ్ అరసాద,
ఎడిటింగ్: నందమూరి హరి,
నిర్మాతలు: డి.గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హారిక్ దేవభక్తుని
విడుదల తేదీ:05,సెప్టెంబర్ 2014.


Click it and Unblock the Notifications