Neha Shetty నేహా శెట్టి కోసం అలా కాంప్రమైజ్ అయ్యా: కిరణ్ అబ్బవరం.. రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
రాజా వారు రాణి గారు, SR కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల హిట్స్‌తో తన రేంజ్ పెంచుకొన్న యువ హీరో కిరణ్ అబ్బవరం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఆయన కుమారుడు దర్శకత్వం వహించగా స్టార్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం రూల్స్ రంజన్.
ఈ సినిమాకు రింకు కుక్రేజా సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ హీరోయిన్, అలనాటి నటి జయచిత్ర కుమారుడు అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఏఎం రత్నం చేతుల మీదుగా విడుదల తేదీని వెల్లడించారు.ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ...

ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా: సుప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. "కిరణ్ ముందుగా నేను నిర్మాతను అని భావించి కథ వినడానికి వచ్చారట. కానీ కథ విని, బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. ఇప్పుడు పాటలు బాలేకపోతే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు. అందుకే సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను.
నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. 'రంగస్థలం', 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలు ఆడియో ఎంత హిట్టో, సినిమాలు అంతకుమించిన హిట్ అయ్యాయి. సినిమా విజయంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు.

కథ చెప్పినప్పడు కిరణ్ అబ్బవరం అలా: దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. కరోనాకు ముందు నేను గోపిచంద్‌తో ఆక్సిజన్ అనే సినిమాను తీశాను. థియేట్రికల్‌గా సక్సెస్ రాలేదు. కానీ ఓటీటీ, టెలివిజన్‌లో చూసిన వారంతా బాగుందని ప్రశంసించారు. ఆ సమయంలో నేను ప్రేక్షకులకు మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించాలని ఫిక్స్ అయ్యాను. హ్యూమర్, లవ్ అంశాలను కలబోసి రూపొందించిన చిత్రమే రూల్స్ రంజన్.
నేను కథ చెప్పడానికి ముందే కిరణ్ అబ్బవరం చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆ విషయం తెలియక ఆయన నన్ను కలిసిన వెంటనే నేను కథ చెప్పాను. కానీ నా కథ విన్న తర్వాత ఫోన్ చేసి.. సినిమా చేయనని చెప్పడానికి వచ్చాను. కానీ మీరు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు అని తెలిపారు.

బ్లాక్‌బస్టర్ అనే నమ్మకం: రూల్స్ రంజన్ మూవీ నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఏఎం రత్నం ద్వారా ఈ సినిమా కథ మా వద్దకు వచ్చింది. దర్శకుడు రత్నం కృష్ణ చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. కథ విన్న వెంటనే బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తాడనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ రూల్స్ రంజన్ అనే సినిమాను అద్బుతంగా మలిచారు అని అన్నారు.

నేహా శెట్టి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ: హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. రూల్స్ రంజన్ సినిమా పాటలు హిట్ కావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకొనే సమయంలో స్పెషల్ సాంగ్స్ ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో వారికి నేను డ్యాన్స్ చేస్తాననే విషయం తెలియదు. సమ్మోహనం సాంగ్ షూట్ చేసేటప్పుడు వాటర్‌లో డ్యాన్స్ చేయాలి. నీళ్లలో స్టెప్పులు వేసేటప్పుడు కింద పడి తల పగులుతుందా అనే భయం కలిగింది. ఇప్పుడు ఆ పాటకు వస్తున్న ఆదరణ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

ఆ అమ్మాయి కోసం కాంప్రమైజ్ అయ్యా: రూల్స్ రంజన్ హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ రెండు గంటలపాటు చెప్పిన కథ వింటూ నవ్వుతూనే ఉన్నాను. సినిమా చూసేటప్పుడు కూడా మీరు కూడా నా మాదిరిగానే నవ్వుతుంటారు. ఈ సినిమాలో సాధారణ యువకుడు మాదిరిగా మనో రంజన్ అనే క్యారెక్టర్ చేశాను.
నా పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాను ఇప్పటికే హిట్ చేసినంతగా పాటలు ఇచ్చిన అమ్రీష్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాలో కాంప్రమైజ్ అనే కాన్సెప్ట్‌తో ఓ పాట ఉంటుంది. సుదర్శన్, వైవాహర్ష, హైపర్ ఆదితో కలిసిన ఆ పాట బాగుంటుంది. జీవితంలో ఎవరైనా అమ్మాయి కోసం కాంప్రమైజ్ కావాల్సిందే. ఈ సినిమాలో నేహా శెట్టి కోసం నేను చాలా కాంప్రమైజ్ అయ్యాను అని చెప్పారు.

నటీనటులు, సాంకేతిక నిఫుణులు
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్, గుల్షన్ పాండే నటిస్తున్నారు.
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
మ్యూజిక్: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
రిలీజ్ డేట్: 2023-09-28


Click it and Unblock the Notifications











