Meter Twitter Review: ఆ సినిమా తరహాలో ఉందంటూ ఊహించని రియాక్షన్.. కిరణ్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ యువ హీరో మొన్నటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు విడుదలవుతున్న సినిమా మరొక లెక్క అనే విధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రమేష్ కడురీ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ను చూసిన నెటిజన్లు ట్విట్టర్ లో ఏ విదంగా స్పందించారు అనే వివరాల్లోకి వెళితే..
పోలీస్ రోల్:కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాలో ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సినిమా ట్రైలర్ తోనే ఇది పక్కా మాస్ కమర్షియల్ సినిమా అని తేల్చేశారు. ఇక సినిమా చూసేందుకు ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆసక్తి చూపించారు అని అర్ధమవుతోంది. ఇక సినిమాను చూసేందుకు కిరణ్ ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన ఫొటోలు కూడా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

మరో బ్లాక్ బాస్టర్ : రాజావారు రాణిగారు సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అనంతరం సమ్మతమే, SR కళ్యాణమండపం అనే సినిమతో కూడా బాక్సాఫీస్ వద్ద ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈసారి మీటర్ సినిమాతో కూడా మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారు అని అనిపిస్తుంది అన్నట్లుగా మరొక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
బాక్సాఫీస్ మీటర్ సెట్: ఇక కిరణ్ అబ్బవరం మీటన్ సినిమా ట్రైలర్ తోనే పక్కా మాస్ సినిమా అందించబోతున్నాం అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కూడా ఓ వర్గం వారిని ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ మీటర్ సెట్.. ర కిరణ్ అబ్బవారం లోడింగ్ హిట్ అంటూ మరికొందరు వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
మాస్ రేంజ్ లో అమ్మాయిలు : కిరణ్ అబ్బవరంకు లేడీస్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కిరణ్ కు సంబంధించిన ప్రతీ సినిమా కూడా ఫ్యామికీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇక ఈ సినిమాతో కూడా అమ్మాయిల చేత కూడా కిరణ్ విజిల్స్ వేయించేలా ఉన్నాడు అనిపిస్తోంది. ఇక ఇపుడు మీటర్ సినిమా చూసేందుకు అమ్మాయిలు రచ్చ రచ్చ చేయాలని పేపర్లు కట్ చేసుకొని మరి సిద్దమవుతున్నారు.
మాములుగా లేదని : ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అని చిరంజీవి మాస్ యాక్టింగ్, నాగార్జున స్టైల్, వెంకటేష్ అమాయకత్వం బాలయ్య రౌద్రం ఇలా అందరూ కలిస్తే కిరణ్ అబ్బవరం న్యూ జెనరేషన్ మాస్ హీరో అని అంటున్నారు. అలాగే మీటర్ సినిమా మాస్ రేంజ్ మాములుగా లేదని కూడా మరికొందరు వివరణ ఇస్తున్నారు.
ఆ సినిమా తరహాలో..:
ఇక మరికొందరు ఏకంగా యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్ యాక్టింగ్ పరవలేదు కానీ అక్కడక్కడా కాస్త సినిమా బోరింగ్ గా ఉంది అని కొన్ని పాత్రలు కూడా చాలా రొటీన్ గా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇక మీటర్ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే ఒక మినిష్టర్ కు సంబంధించిన కాన్సెప్ట్ లో ఉంటుందని అంటున్నారు. అలాగే పటాస్ సినిమా ఛాయలు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నట్లు మరికొందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











