Rules Ranjan Postponed: పాపం కిరణ్ అబ్బవరం.. మళ్లీ దెబ్బపడిందిగా!

కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్. ఇక ఈ సినిమాలో డీజే టిల్లు భామ నేహాశెట్టి హీరోయిన్ గా నటి్స్తోంది. ఇదిలా ఉంటే.. సలార్ మూవీ రేసులో నుంచి తప్పుకోవడంతో.. సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్ వద్దాం అనుకున్నాడు. కానీ పాపం కిరణ్ అబ్బవరంకు దెబ్బ మీద దెబ్బ పడేలా అయింది. ఆ రోజుకు చాలా సినిమాలు రిలీజ్ కు వచ్చి చేరాయి. చివరకు కిరణ్ అబ్బవరమే తగ్గి.. ఓ వారం ముందుకు వెళ్లాడు. దీనితో రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ వాయిదా పడి.. అక్టోబర్ 6న రిలీజ్ కు రెడి అయింది. ఆ వివరల్లోకి వెళితే...

సెప్టెంబర్ 28.. ఈ రోజున ప్రభాస్ నటించిన సలార్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆ రోజున రావడం లేదంటూ చెప్పుకోచ్చారు మేకర్స్. ఇక కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఇక సింగిల్ గా ఆ వారం మొత్తం బాక్సాఫీస్ వద్ద రూల్స్ రంజన్ గా సందడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అసలే హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం కు మళ్లీ దెబ్బ పడింది.

Kiran Abbavaram Neha Shetty Rules Ranjan New Release Date is October 6th officially announced

సినిమాలు అయితే చేసుకుంటూ పోతున్న కిరణ్ అబ్బవరం.. వాటి ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన మీటర్ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆయన తదుపరి చిత్రం రూల్స్ రంజన్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

Kiran Abbavaram Neha Shetty Rules Ranjan New Release Date is October 6th officially announced

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ 'రూల్స్ రంజన్' సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ ఫుల్ ఫిల్మ్స్ 'డీజే టిల్లు', 'బెదురులంక 2012' తర్వాత ఆమె నటించిన చిత్రం కావడంతో మంచి బజ్ నెలకొంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఆయన తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు.

Kiran Abbavaram Neha Shetty Rules Ranjan New Release Date is October 6th officially announced

సలార్ వాయిదా పడటంతో... రూల్స్ రంజన్ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. అయితే ఆ రోజుకు రామ్ పోతినేని బోయపాటి స్కంద వచ్చి చేరింది. ఇక ఆ తర్వాత రాఘవా లారెన్స్, కంగనా రౌనౌత్ చంద్రముఖి 2 కూడా అదే రోజు రిలీజ్ కానుంది. వివేక్ అగ్నిహోత్రి వాక్సిన్ వార్, నితిన్ నార్నే మ్యాడ్ చిత్రాలు కూడా అదే రోజున రిలీజ్ కానున్నాయి. ఒకరోజు గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సెప్టెంబర్ 29న రానుంది.

Kiran Abbavaram Neha Shetty Rules Ranjan New Release Date is October 6th officially announced

అంటే కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ వద్ద 5 సినిమాలతో పోటీలోకి దిగాలి. టాక్ అటు ఇటు అయితే.. వచ్చే కలెక్షన్లు కూడా రావని... ఓ వారంముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రూల్స్ రంజన్ బాక్సాఫీస్ వద్దకు అక్టోబర్ 6న వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇక అసలే హిట్లు లేని కిరణ్ అబ్బవరం సినిమాకు ఇంత పోటీ ఉండటంతో.. కాస్త రూల్స్ బ్రేక్ చేసి.. ముందుకు వెళ్లాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X