Rules Ranjann Twitter Review: క్రేజీగా రూల్స్ రంజన్.. మూవీలో హైలైట్ అదే.. కిరణ్ హిట్ కొట్టాడా అంటే!

సినిమా నేపథ్యంలో లేకుండానే ఈ మధ్యన ఎంతో మంది తెలుగు కుర్రాళ్లు హీరోలుగా వచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. అందులో నేచురల్ యాక్టింగ్‌తో ఫిదా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా ఎంటరైన అతడు.. ఆ వెంటనే కొన్ని డీసెంట్ హిట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' అనే సినిమాతో వచ్చేశాడు. మరి ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ఇంతకీ ఈ యంగ్ హీరో హిట్ కొట్టాడా? అనేవి చూద్దాం పదండి!

రూల్స్ రంజన్‌గా కిరణ్ ఎంట్రీ: కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీనే 'రూల్స్ రంజన్'. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మించారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు కీలక పాత్రలు చేశారు.

Kiran Abbavaram Starrer Rules Ranjann Movie Twitter Review

అలాంటి కథతో.. ఫన్ రైడ్‌‌గానే: మనో రంజన్ అనే ఓ డీసెంట్ కుర్రాడు తన చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అలాంటి అతడి జీవితంలోకి ఓ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో రూల్స్ రంజన్‌గా మారిపోతాడు. అప్పటి నుంచి అతడిలో వచ్చిన మార్పులతోనే 'రూల్స్ రంజన్' సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే అంచనాలు ఏర్పడడంతో ఇది గ్రాండ్ స్కేల్‌లోనే రిలీజ్ అయింది.

ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్స్‌తో: రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో ఇలా స్పందించారు. అందులో 'రూల్స్ రంజన్ మూవీలో ఫస్టాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో చాలా కామెడీ సన్నివేశాలతో పాటు వన్ లైనర్ పంచ్ డైలాగులతో నిండి ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.

సెకెండాఫ్ కూడా బాగుందని: కిరణ్ అబ్బవరం - నేహా శెట్టి జంటగా నటించిన 'రూల్స్ రంజన్' మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో రెస్పాండ్ అయ్యారు. ఇందులో 'రూల్స్ రంజన్ మూవీ సెకెండాఫ్ కూడా చాలా బాగుంది. ఫన్ రైడ్‌తో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగింది. నేహా శెట్టి చాలా అందంగా ఉంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మరోసారి విజయాన్ని సొంతం చేసుకున్నాడు' అని రాసుకొచ్చారు.

డిసప్పాయింట్ చేసిందని: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'రూల్స్ రంజన్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'సినిమా అనుకున్న స్థాయిలో లేదు. చాలా పాత కంటెంట్‌తో వచ్చింది. ఒక్క సీన్ కూడా నాకు ఆసక్తిగా అనిపించలేదు. కానీ, సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం బాగున్నాయి. సమ్మోహనుడా సాంగ్ సినిమాకు ప్లస్' అని పేర్కొన్నారు.

ఈ వీకెండ్‌కు చూసే మూవీ: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'రూల్స్ రంజన్' మూవీని తిలకించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా స్పందించారు. 'రూల్స్ రంజన్ ఫస్టాఫ్ బాగుంది. కానీ, సెకెండాఫ్ ఏవరేజ్‌గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ బాగా వచ్చాయి. అలాగే, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, కిరణ్ అబ్బవరం యాక్టింగ్, డ్యాన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌కు చూడదగ్గ సినిమా' అని తెలిపారు.

Kiran Abbavaram Starrer Rules Ranjann Movie Twitter Review

ఓవరాల్‌గా డీసెంట్ టాక్‌తో: కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం దీనికి డీసెంట్ టాక్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో కామెడీ సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. అయితే, సెకెండాఫ్ ఏవరేజ్‌గా ఉందని చెప్తున్నారు. ఇక్కడ షోలు పడిన తర్వాత టాక్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X