యంగ్ పొలిటికల్ లీడర్ గా రాజకీయాల్లోకి ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’
మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనగానే టాలీవుడ్ లో ఈ మధ్యనే వచ్చిన సినిమా అనుకునేరు..మనం మాట్లాడుకుంటోన్నది బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి. కమర్షియల్ సినిమాల్ని పక్కన పడేసి, వెరైటీ సినిమాలపైనా, సొసైటీకి పనికొచ్చే సినిమాలపైనా ఫోకస్ పెట్టిన అమీర్ కాన్, అవినీతికి వ్యతిరేకంగా సమరశంకం పూరించబోతున్నాడు.
రియల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో అదీ పొలిటికల్ లీడర్ గా..తన భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించనున్నఈ సినిమాని అమీర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తాడు. అవినీతి దేశాన్ని ఎలా అద:పాతాళానికి తొక్కేస్తోందో ఈ చిత్రంలో చూపించబోతున్నాడట అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వ్యవహారాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తుండడం మరో విశేషం. యంగ్ పొలిటికల్ లీడర్ గా ఈ సినిమాలో కన్పించనున్న అమీర్ ఖాన్, వారసత్వ రాజకీయాలపైనా ఈ సినిమాతో ఘైటైన విమర్శలు చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. ఇందుకోసం పొలిటికల్ పుస్తకాల్ని తిరగేయడంతోపాటు, లైబ్రరీల చుట్టూ తిరుగుతున్నాడు. దేశంలో ఇప్పటిదాకా సంభవించిన కీలక రాజకీయ పరిణామాలను అధ్యయనం చేయడంలో భాగంగా హిందీతోపాటు సుమారు 12భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలనేది అమీర్ ఖాన్ ఉద్దేశ్యమట..


Click it and Unblock the Notifications











