Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'హైస్కూల్ ప్రేమ'
బాలనటుడు కార్తీక్, కిరణ్ రాథోడ్ హీరో హీరోయిన్లుగా ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై నరసింహ నంది దర్శకత్వంలో మల్లన్న నిర్మిస్తున్న చిత్రానికి 'హైస్కూల్" అనే పేరు ఖరారు చేసారు. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర నిర్మాత మల్లన్న మాట్లాడుతూ "ఈ చిత్రానికి 'హైస్కూల్" అనే పేరు నిర్ణయించాం. గురువారం నుంచి బేగంపేటలో రెండో షెడ్యూల్ ప్రారంభించాం. ఇంతవరకు రెండు పాటలు, కొంత టాకీ పూర్తయింది. అనుకున్న బడ్జెట్ కంటె ఎక్కువ అవుతున్నప్పటికీ సినిమా చాలా బాగా వస్తోంది.
30 ఏళ్ళ యువతి(కిరణ్ రాథోడ్)తో 13 ఏళ్ళ బాయ్(కార్తీక్) మద్య జరిగే ప్రేమ కథ నరసింహ నంది ఈ కథను చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారు" అన్నారు. కథానాయకుడు కార్తీక్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నాకు ఇంతమంచి పాత్ర దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అన్నారు. మరో కథానాయకుడు రాఘవ మాట్లాడుతూ "హీరోగా ఇదే నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగా వస్తోంది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది" అన్నారు.
చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ "ఇంతవరకు ఇటువంటి కథతో తెలుగులో ఏ సినిమా రాలేదు. ఇటాలియన్ భాషలో వచ్చిన ఒక సినిమా ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. ఇందులో వినోదం తో పాటు సెంటిమెంటు కూడా పుష్కలంగా వుంటుంది. వచ్చే నెల 7తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అక్టోబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు