బూతు తీయలేదు..లవ్ ఫిలిమ్ మాత్రమే
తమ చిత్రం ఎంతమాత్రం బూతు సినిమా కాదనీ, రొమాంటిక్ లవ్ సెన్సిబుల్ చిత్రమని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. తాజాగా నంది అవార్డు అందుకున్న ఆయన 'హైస్కూలు'అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు.
బి.గోపాల్ మాట్లాడుతూ...సాకేత్ సాయిరామ్ అందించిన పాటలన్నీ చాలా బాగున్నాయనీ, మాస్టర్ కార్తీక్ కు మంచి భవిష్యత్తు ఉందనీ అన్నారు. ఈ సినిమా క్లిప్పింగ్ చాలా బాగున్నాయనీ, చిత్ర దర్శకుడు నరసింహ నంది గతంలో '1940లో ఒక గ్రామం' అనే చక్కటి చిత్రాన్ని తీశారనీ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
నిర్మాత మల్లన్న మాట్లాడుతూ...ఇవాల్టి ట్రెండ్ కు అనుగుణంగా ఓ మంచి పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని పేర్కొన్నారు. పాటలకు, రీరికార్డింగ్ కూ మంచి స్కోప్ ఉందనీ, దర్శకుడికి కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ సాకేత్ సాయిరామ్ అన్నారు. సాకేత్ సాయిరామ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.


Click it and Unblock the Notifications











