ముఫ్పై ఏళ్ళ ఆంటీతో 13 ఏళ్ళ కుర్రాడు..
30 ఏళ్ళ యువతి(కిరణ్ రాథోడ్)తో 13 ఏళ్ళ బాయ్(కార్తీక్) మద్య జరిగే ప్రేమ కథగా హైస్కూల్ చిత్రం తెలకెక్కుతున్న సంగతితెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం డి.టి.యస్. మిక్సింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.."అన్ని తరగతులు ప్రేక్షకులు ఆస్వాదించే రీతిలో చిత్రాన్ని మలచాం. రొమాన్స్, కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. ప్రతి పాటా ఆకట్టుకుంటుంది. గ్లామర్ హీరోయిన్‌గా ప్రేక్షకులకు సుపరిచితురాలైన కిరణ్‌రాథోడ్ ఈ సినిమాలో గ్లామర్‌తోపాటు చక్కని నటన కూడా ప్రదర్శించింది'' అని తెలిపారు.
అలాగే సినిమా గురించి నిర్మాత మల్లన్న తెలియజేస్తూ "ఒక చక్కని ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టును రొమాంటిక్ తరహాలో కామెడీ, సెంటిమెంట్ మేళవించి దర్శకుడు నరసింహా అందంగా తీర్చిదిద్దుతున్నారు. కిరణ్ రాథోడ్ గ్లామర్ సినిమాకి ఎస్సెట్. త్వరలో ఆడియో విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు. మిగతా పాత్రల్లో గుండు హనుమంతరావు, గౌతంరాజు, జెన్నీ, రజిత, తిలక్, మల్లిక కనిపించనున్నారు. అలాగే చిత్రానికి సంగీతం: సాకేత్ సాయిరామ్, సినిమాటోగ్రఫీ: కళ్యాణ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరసింహ నంది.


Click it and Unblock the Notifications











