అది కిరణ్ రాథోడ్ రతి నిర్వేదం?

By Staff

ఆ కుర్రాడు వయస్సు పదమూడు. ఆమె వయస్సు ముప్పై. ఆమెతో అతను శృంగారం పొందాలని ప్రయత్నం చేస్తాడు. ఇటలి సినిమా మలీనా ఆధారం గా ఈ చోటి సే లవ్ స్టొరీ మొదలైంది. అందరు దొంగలే, సత్యమే సుందరం వంటి చిత్రాలతో తెలుగు నాట పాపులర్ ఐన కిరణ్ రాథోడ్ ఈ మలీన తెలుగు వెర్షన్ లో నటిస్తోంది. నూతన దర్శకుడు నరిసింహ నంది ఈ చిత్రం డైరెక్ట్ చేస్తున్నాడు. అతను ఈ చిత్ర ప్రారంభం సందర్భం గా మాట్లాడుతూ తమ సినిమా ఇటలి ఫిలిం మలీన ఆధారంగా తయారౌతోందని చెప్పాడు. ఇక కొంత కాలంగా వేషాలు లేక వెనక బడ్డ కిరణ్ రాథోడ్ మాట్లాడుతూ తన పాత్ర సాప్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పింది. ఇక శృంగార ప్రధాన మైన సినిమా అని మలీన గురించి చెప్పినప్పుడే వచ్చిన వారికి అర్ధమైంది.

ఇంతకు ముందు కూడా భానుప్రియ తో టీచర్ ఐ లవ్ యు అనే చిత్రం గతంలో వచ్చింది. అంతకు ముందు మనీషాతో ఏక చోటేసే లవ్ స్టొరీ తీసారు. వీటన్నిటి కి ముందు రతి నిర్వేద అనే మలయాళ సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. దానిని భరతాన్ అనే దర్శకుడు డైరెక్ట్ చేసాడు. దాంతో ఆ తరహ సినిమా గా మారే అవకాసం ఉందంటున్నారు. ఇక ఈ చిత్రం ఓపెనింగ్ లో మీడియా వారు కిరణ్ రాథోడ్ ని మరి శృంగార సన్నివేశాలులలో కనిపిస్తారా అంటే పెదవి విప్ప లేదు. ఇక కిరణ్ రాథోడ్ వెయ్య బోయే పాత్ర ను ఇటలి లిలో సెక్సీ స్టార్ మోనికా బెలుచి వేసింది. ఇక ఈ చిత్రం తమిళ్ లో కూడా రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దానికి రతి నిర్వేద అనే పేరు పీట్టి అవకాసం ఉంది.

ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గురువారంనాడు మొదలైంది. కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు హర్షవర్దన్ క్లాప్ ఇవ్వగా, హీరో బాలాదిత్య కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుల సంఘం కార్యదర్శి జి.రాంప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నరసింహ నంది తెలియజేస్తూ, గతంలో తాను '1940లో ఒక గ్రామం' చిత్రానికి దర్శకత్వం వహించాననీ, ఇది తన రెండో చిత్రమనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, తిలక్, రాగిణి, రజిత, జెన్నీ, గౌతంరాంజు, మల్లిక, చంద్ర, సుదర్శన్, రంగ తదితరులు నటిస్తున్నారు. నరసింహ నంది కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, నాగరాజు కొరియోగ్రఫీ, వాసు కళాదర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X