భయం భయంగా...హాట్ లేడీ
హాట్ లేడీ కిరణ్ రాథోడ్ తర్వలో 'భయం భయం" తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదిత్య, కిరణ్‌రాథోడ్, ప్రేమ ప్రధాన పాత్రల్లో సునీల్‌కుమార్ దేశాయి రూపొందించిన చిత్రాన్ని 'భయం భయం" అనే పేరుతో శ్రావ్య మూవీస్ పతాకంపై నిర్మాత దిలీప్ కుమార్ తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని 'భయం భయం" పేరుతో తెలుగులో అందిస్తుండటం ఆనందంగా వుందన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా దర్శకుడు సునీల్‌కుమార్ దేశాయి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకముందన్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జర్మనీ, స్విట్జర్లాండ్, బాంబే, బెంగుళూర్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. ఇందులో ప్రముఖ కన్నడ నటుడు విష్ణువర్థన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. శ్రీదేవి, కిశోర్, ఆలీఖాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి. పట్నాయక్, ఎడిటింగ్: నందమూరిహరి. గతంలో కిరణ్ రాథోడ్ హైస్కూల్ లాంటి పలు భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సారి భయం భయంగా... ఈ హాట్ లేడీ చేసిన ఘనకార్యం ఏమిటి? అనేది సినిమా విడుదలైతేగానీ తెలీదు.


Click it and Unblock the Notifications











