నాని వల్లే జీవితాలు తారుమారు.. పాములతో ఆడుకుని వచ్చిన అమ్మాయి, బిగ్ బాస్ గురించి కిరీటి!
Recommended Video

బిగ్ బాస్ రెండవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే షో నుంచి ముగ్గురు సభ్యులు ఎలిమినేటి అయ్యారు. తొలి రెండు వారాల్లో సామాన్యులుగా ఉన్న సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ జరిగేకొద్దీ ఆడియన్స్ లో షో పై ఆసక్తి పెరుగుతోంది. మూడవ వారంలో నటుడు కిరీటి ఎలిమినేట్ అయ్యారు. షో నుంచి ఎలిమినేట్ అయిన కిరీటి ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తనకు షో నుంచి ఎలిమినేట్ కావడం భాద కలిగించలేదని, ఇప్పుడు తన సినిమాలు తాను చేసుకుంటానని చెబుతున్నాడు.

ఆసక్తికరంగా
బిగ్ బాస్ లో నిజాయితీపరుడు ఎవరనే ప్రశ్నకు కిరిటీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. బిగ్ బాస్ లో నాని మాత్రమే నిజాయతీ పరుడని సమాధానం ఇచ్చాడు.

కుట్రలు జరగలేదు
బిగ్ బాస్ షో విజయవంతంగా నడపడానికి 400 మంది పనిచేస్తున్నారని కిరీటి తెలిపారు. ఇక కుట్రలు చేసే సమయం ఎక్కడ ఉంది. ఇది రియాలిటీ గేమ్ షో మాత్రమే అని, ఎవరికీ తగ్గట్లు వారు ఆడుతారని కిరీటి తెలిపారు.

విజయావకాశాలు
బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచే అవకాశం చాలా మందికి ఉందని కానీ, ఆస్థాయిలో సత్తా మాత్రం తేజస్వికి ఉందని కిరీటి తెలిపాడు. ఆ అమ్మాయి పాములతో ఆడుకుని వచ్చిందని బిగ్ బాస్ షో లెక్క కాదని కిరీటి తెలిపాడు.

బాబు గోగినేని గురించి
బాబు గోగినేని తనకు మంచి స్నేహితుడిగా మారిపోయారని కిరీటి తెలిపాడు. స్వేచ్ఛగా ఆలోచించగలగడం అందరి బాధ్యత అని ఆయన చెప్పిన మాటని జీవితాంతం గుర్తుంచుకుంటానని కిరీటి తెలిపారు.

నాని వల్లే జీవితాలు తారుమారు
బిగ్ బాస్ లో నాని వల్లే జీవితాలు తారుమారు అవుతాయని కిరీటి తెలిపాడు. నాని చెప్పే ఒక్క మాటపైనే కంటెస్టెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపాడు.

పోల్చి చూడలేం
నాని అద్భుతమైన హోస్ట్ అని కితాబిచ్చాడు. నానిని, ఎన్టీఆర్ ని పోల్చి చూడలేం అని కిరీటి సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











