»   » అల్లు అర్జున్‌ను లైన్లో పెట్టిన భామ.. ‘పార్టీ’లో దుమ్మురేపి..

అల్లు అర్జున్‌ను లైన్లో పెట్టిన భామ.. ‘పార్టీ’లో దుమ్మురేపి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కన్నడ చిత్రం కిరిక్ పార్టీలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన రష్మికా మందన్న టాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్దమవుతున్నది. సినీ కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారుతూ రూపొందిస్తునన్న నా పేరు శివ, నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో అల్లు అర్జున్‌‌తో రష్మీకా జోడీ కట్టేందుకు ఎంపికైనట్టు సమాచారం. ఒకవేళ అల్లు అర్జున్‌తో నటిస్తే రష్మికాకు ఇది రెండో చిత్రం. ఒక చిత్రంలో నటిస్తుండగానే మరో భారీ చిత్రంలో అవకాశం రావడం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది.

  కిరిక్ పార్టీలో మంచి పేరు

  కిరిక్ పార్టీలో మంచి పేరు

  ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని చిత్రంలో నాగశౌర్య పక్కన రష్మికా నటిస్తున్నది. దువ్వాడ జగన్నాధం చిత్రం రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ప్రారంభించే చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో రష్మికా పాల్గొంటుందనే తాజా సమాచారం. కిరిక్ పార్టీ చిత్రంలో రష్మికా నటన విమర్శల ప్రశంసలు అందుకొన్నది.

  పునీత్ రాజ్‌కుమార్ పక్కన

  పునీత్ రాజ్‌కుమార్ పక్కన

  కిరిక్ పార్టీ విజయం తర్వాత వెంటనే అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆమె కెరీర్‌కు ఉపయోగపడే చిత్రాలను ఎంపిక చేసుకొంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం కన్నడంలో తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించనున్నది. ఈ చిత్రం పేరు అంజనీ పుత్ర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.

  గోల్డెన్ స్టార్ గణేశ్‌తో జోడి..

  గోల్డెన్ స్టార్ గణేశ్‌తో జోడి..

  ఇదిలా ఉండగా, మరో భారీ అవకాశం రష్మికా తలుపు తట్టింది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు ఏ హర్ష రూపొందించే చమక్ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో గోల్డెన్ స్టార్ గణేష్ కథానాయకుడు. ఈ క్రమంలోనే నాగశౌర్య పక్కన నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నది.

  ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా

  ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా

  టాలీవుడ్‌లో నాగశౌర్య పక్కన నటిస్తున్నప్పటికీ రష్మికా పేరు అంతగా వినపడలేదు. కానీ అల్లు అర్జున్ చిత్రంలో నటిస్తున్నదనే వార్తతో రష్మికా పేరు టాలీవుడ్‌లో మార్మోగుతున్నది. అయితే ఈ సినిమాలో రష్మిక చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఇంకా ఆ వార్తపై సందిగ్ధత కొనసాగుతున్నది.

  హైదరాబాద్‌లో ట్రయల్ షూట్

  హైదరాబాద్‌లో ట్రయల్ షూట్

  నా పేరు శివ, నా ఇల్లు ఇండియా చిత్రంలోని పాత్ర కోసం రష్మికాను ఇటీవల హైదరాబాద్‌కు రప్పించినట్టు తెలిసింది. సినిమాలో కీలక పాత్ర కావడంతో ఆమెకు హైదరాబాద్‌లో స్క్రీన్ టెస్ట్ నిర్వహించినట్టు సమాచారం. హోటల్ ట్రైడెండ్‌లో ట్రయల్ షూట్ చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.

  సైనికుడి పాత్రలో అల్లు అర్జున్

  సైనికుడి పాత్రలో అల్లు అర్జున్

  నా పేరు శివ, నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ యువతకు స్ఫూర్తిగా నిలిచే పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ వరుస విజయాలందుకొంటున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  English summary
  Stylish star Allu Arjun has given nod to writer Vakkantham Vamshi’s film, who will be making his directional debut. According to the latest update, the filmmakers approached Actor Rashmika Mandanna, who hogged the limelight with recent blockbuster Kannada film Kirik Party, to play the female lead opposite Allu Arjun. Recently she visited Hyderabad for a look test and did a trail shoot at Hotel Trident in the last weekend for this new movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more