జగన్ 2.0 అంటే అర్థమిదే? రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.!
కిర్రాక్ ఆర్పీ... బుల్లితెర ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడు. వెండితెరపైనా పలు చిత్రాల్లో ఆయా పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'జబర్దస్త్' కామెడీ షోతో ఆయనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో స్కిట్లు కొడుతూ టెలివిషన్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. టీవీ నుంచి అటు వెండితెర వైపు కూడా ఈయన నుంచి అడుగులు పడ్డాయి. దర్శకుడిగా ఒకటి రెండు చిత్రాలను మొదలు పెట్టారు.. కానీ పూర్తి చేయలేకపోయారు.
ఇదిలా ఉంటే.. కిర్రాక్ ఆర్సీ రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర 2024 ఎలక్షన్స్ లో ఆయన యాక్టివ్ గా పనిచేశారు. కూటమి తరపున కిర్రాక్ ఆర్సీ చేసిన ప్రచారం అందరిని ఆకట్టుకుంది. తన వాక్ ధాటితో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను స్టేట్ మెంట్లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. తన వాయిస్ ను గట్టిగా వినిపించారు. టీడీపీ తరపున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. నాగబాబుకు, టీడీపీ తరుపున వర్క్ చేశారు. ఇక ఎలక్షన్స్ లో కూటమి విజయ పతాకాన్ని ఎగరేసిన తర్వాత కూడా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుత ఏపీ రాజకీయాలపైనా కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. వైసీపీ నేతల స్పందనకు ప్రతిస్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కాస్తా ఘాటుగా స్పందించారు. జగన్ 2.0 స్పీచ్ పై ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వైసీపీ నేతలకు కౌంటర్ గానూ వెళ్తొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారడం విశేషం. దాని ప్రకారం.. జగన్ 2.0 స్టేట్ మెంట్ కు కిర్రాక్ ఆర్సీ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.
కిర్రాక్ ఆర్పీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో జగన్ 2.0 అంటూ వైసీపీ నేత స్పీచ్ పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ 2.0 అంటే.. గత ఎన్నికల్లో నాకొచ్చింది 11. వాటి మొత్తం 2, వాటి బేధం 0. 2.0 అంటే 2029లో వారికి వచ్చే సీట్లు 0... అని జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆర్సీ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 అనే నినాదంతో పోటీ చేసినా.. తీరా 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇది ఘోర పరాజయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ మళ్లీ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యక్రమాలు, మీటింగ్ లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో జగన్ 2.0 అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. 2.0 మరింత బలంగా ఉంటుందని, 30 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండబోతున్నాని భాష్యం చెప్పారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. జగన్ 1.0కే రాష్ట్రం నాశనమైందని, ఇంకా 2.0కు అవకాశం ఉండబోదని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులతో పాటు జనసైనికులు కూడా జగన్ స్పీచ్ పై స్పందిస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











