అమెరికా సెక్స్ రాకెట్‌లో ఆరుగురు హీరోయిన్లు.. వెలుగులోకి మరో చీకటి కోణం!

By Rajababu

వరుస వివాదాలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి వివాదం నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న ఇండస్ట్రీకి అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో మరో దెబ్బ పడింది. షికాగో నగరంలో వ్యభిచారానికి పాల్పడిన తెలుగు తారల వ్యవహారం బయట పడటంతో సినీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. షికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో సినీ నిర్మాత కిషన్ మొదుగుముడి, అతని భార్య చంద్రకళ పూర్ణిమ మొదుగుముడిని ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

విక్టిమ్-ఎగా తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింన హీరోయిన్
 ఏడాది కాలంలో ఆరుగురు హీరోయిన్లు

ఏడాది కాలంలో ఆరుగురు హీరోయిన్లు

ఫెడరల్ పోలీసుల దర్యాప్తులో భయంకరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతేడాది తెలుగు సంఘాల నిర్వహించే కార్యక్రమాల పేరుతో మొత్తం ఆరుగురు హీరోయిన్లను అమెరికాకు తీసుకెళ్లినట్టు వెలుగు చూసింది. ఆ సమయంలో తమ క్లయింట్లకు హీరోయిన్లను కలిపి వ్యభిచార కార్యక్రమాలకు తెరలేపారనే విషయం స్పష్టమైంది.

షికాగో నుంచి కాలిఫోర్నియాకు వెళ్లడం

షికాగో నుంచి కాలిఫోర్నియాకు వెళ్లడం

గతేడాది నవంబర్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా (టీఏఎస్‌సీ) ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. 2017 నవంబర్ 6వ తేదీన ఢిల్లీలో జారీ చేసిన వీసాతో ఓ హీరోయిన్ అమెరికాకు వెళ్లింది. షికాగోలోని ఓ హారే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన హీరోయిన్ రెండు రోజుల తర్వాత కాలిఫోర్నియాకు వెళ్లడం అనేక అనుమానాలకు దారి తీసింది.

చేతులెత్తేసిన తెలుగు సంఘం

చేతులెత్తేసిన తెలుగు సంఘం

సదరు హీరోయిన్‌పై అనుమానం రావడంతో ఆమెను పోలీసుల విచారించగా.. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) నిర్వహించే మరో ఈవెంట్‌ కోసం కాలిఫోర్నియాకు వెళ్లానని చెప్పడం జరిగింది. అయితే నాట్స్ నిర్వాహకులను సుదీర్ఘంగా విచారించగా, సదరు హీరోయిన్‌ను తాము పిలువలేదు అని చెప్పారు. ఆ తర్వాత శ్రీరాజు చెన్నుపాటి తనకు ఈవెంట్స్ పాల్గొనే అవకాశం సదరు హీరోయిన్ కల్పించడంతో అసలు బండారం బయటపడింది.

సినీ తార మూడు నెలల మకాం..

సినీ తార మూడు నెలల మకాం..

ఇక రెండో హీరోయిన్ వ్యవహారం మరింత గందరగోళంగా మారింది. డిసెంబర్ 2017 డిసెంబర్ 26న ముంబై నుంచి హీరోయిన్ బయలుదేరి వెళ్లి నీవార్క్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో దిగింది. అంతకు ముందే అక్టోబర్ 3న అమెరికాకు వెళ్లి రెండు నెలలపాటు ఉన్నారు. ఆ పర్యటనలోనూ శ్రీరాజు చెన్నుపాటి (కిషన్) రెఫరెన్స్ ఇవ్వడం గమనార్హం. ఆ సమయంలోనే హీరోయిన్‌తో వ్యభిచారాన్ని శ్రీరాజు నిర్వహించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.

 ఈవెంట్ కోసం హీరోయిన్

ఈవెంట్ కోసం హీరోయిన్

తెలుగు సంఘాల ఈవెంట్ల పేరుతో మరో ముగ్గురిని అమెరికాకు రప్పించి వ్యభిచార కార్యక్రమాలకు కిషన్ తెరతీసినట్టు సమాచారం. ఈ విషయమంత ఫెడరల్ అధికారుల దర్యాప్తులో పలు విషయాలు వెలుగుచూశాయి.

కన్నడ, తెలుగు హీరోయిన్ వ్యవహారం

కన్నడ, తెలుగు హీరోయిన్ వ్యవహారం

తెలుగు, కన్నడ రంగాలకు చెందిన మరో హీరోయిన్ పేరు కూడా అమెరికా ఫెడరల్ అధికారులు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ హీరోయిన్‌ను అమెరికా తెలుగు అసోసియేషన్ ఆమెను ఆహ్వానించినట్టు దర్యాప్తులో తేలింది. ఆ పర్యటనలో భారీ ఎత్తున డబ్బు ఎరవేసి వ్యభిచార కార్యక్రమాలను నిర్వహించినట్టు స్పష్టమైంది. అయితే పలు తెలుగు సంఘాలు ఈవెంట్లతో సంబంధం లేదని చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X