'వెన్నెల వన్ అండ్ హాఫ్'లో అదే చూపిస్తున్నాం

నిర్మాతలు వాసు, వర్మ మాట్లాడుతూ ''వెన్నెల ఎంత హాయిగా ఉంటుందో.. మా సినిమా అలా ఉంటుంది. సంపాదనపై వ్యామోహంతో విదేశాలకు పయనమవుతున్న యువతరం.. అక్కడ పడుతున్న అగచాట్లను వినోదం మేళవించి చెబుతున్నాం. ఈ నెల 21న విడుదల చేస్తాము''అన్నారు. గతంలో విడుదలైన 'వెన్నెల' చిత్రానికి ఇది కొనసాగింపు. అలాగే వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ''మా చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. వినోదానికి పెద్ద పీట వేసిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే విశ్వాసం మాకుంది'' అని తెలిపారు.
ఇక ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్ అండ్ హాఫ్' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటించారు.
అలాగే కన్నీరు పెట్టించే సన్నివేశాలు, కంగారు పుట్టించే దృశ్యాలు ఇవేం మా సినిమాలో లేవు. కేవలం నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. ప్రతి పాత్రా వినోదాన్ని అందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రం నచ్చి ఎ టీవీ వాళ్లు అవుట్ రేట్ కు కొన్నట్లు సమాచారం. 'వెన్నెల' చిత్రం ద్వారా పరిచయమై, హాస్యనటుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు కిశోర్. ఒకవైపు నటుడిగా కొనసాగుతూ మరోవైపు ఆయన 'వెన్నెల వన్నండాఫ్' చిత్రానికి దరక్శకత్వం వహించారు. 'వెన్నెల'కు సీక్వెల్ ఇది.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'వెన్నెల 1 1/2' చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఫోటోగ్రఫీ: సురేష్ భార్గవ్, సాహిత్యం: కృష్ణ చైతన్య, శ్రీమణి, సిరాశ్రీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











