twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు అన్న ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘గోపాల గోపాల' చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ) మీడియా ముందుకొచ్చి సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరులతో ముచ్చటించారు. ‘తడాఖా'ను రీమేక్ తర్వాత సొంత కథతో వద్దామనుకున్నాను కానీ అనుకోండా ‘గోపాల గోపాల' రీమేక్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

    పవన్ కళ్యాణ్ లాంటి వారితో పని చేయడం మంచి అనభవని డాలీ చెప్పుకొచ్చారు. సినిమా అందరూ బావుందని మెచ్చుకుంటుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం హిందీ మూవీ ‘ఓ మై గాడ్'కు రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తిగిన విధంగా అనేక మార్పులు చేసామని, అందువల్లే సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.

    Kishore Kumar Pardasani interview about Gopala Gopala

    తెలుగు వారి దృష్టిలో దేవుడి పాత్ర అంటే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత నటుడు ఎన్.టి. రామారావుగారే. ఇపుడు అదే తరహా ఇమేజ్ పవన్ కళ్యాణ్‌కి ఉందని ఉందనిపించింది. కృష్ణుడి పాత్రకు ఎవరని ఆలోచిస్తే ముందుగా ఆయనే గుర్తొచ్చారు అని డాలీ చెప్పుకొచ్చారు. కథ వినగానే అంగీకరించి పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు పవన్ కళ్యాణ్ అని తెలిపారు.

    ఈ సినిమా చిత్రీకరణలో ఉన్నంత కాలం పవన్ కళ్యాన్ ఆవుపాలు, అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివే తీసుకున్నారని దర్శకుడు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ ఇద్దరే. తెరపై తాము కనిపించాలని కోరుకోరు...పాత్రలు మాత్రమే ప్రేక్షకుల్లో గుర్తుండి పోవాలని తపన పడుతుంటారు. అందుకే వారు చేసే పాత్రలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటాయని డాలీ చెప్పుకొచ్చారు.

    English summary
    Kishore Kumar Pardasani interview about Gopala Gopala success. directed by Kishore Pardasani (Dolly). produced by D. Suresh Babu, Sharath Marar. music by Anoop Rubens. Shriya female lead in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X