అడవి శేషు 'కిస్‌' కాన్సెప్టు ఇదే...

By Srikanya

KISS Is Romantic, Not Raunchy: Sesh Adivi
హైదరాబాద్ : పంజా చిత్రంలో విలన్ పరిచయమై బలుపుతో పేరు తెచ్చుకున్న నటుడు,దర్శకుడు అడివి శేష్‌. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'కిస్‌'. ప్రియా బెనర్జీ నాయిక. సాయికిరణ్‌ అడివి నిర్మాత. 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై అడవి సాయికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అడివి శేష్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తన చిత్రం కాన్సెప్టు గురించి చెప్పాడు.

అడవి శేషు మాట్లాడుతూ.... ''దొంగతనం రాని ఓ దొంగ.. తన జీవితమంటే నచ్చని ఓ అమ్మాయి.. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఆ కలయికలోని 24 గంటల్ని మా సినిమాలో చూపిస్తున్నామ''న్నారు ''తీరం దగ్గర మనం నిల్చుని సముద్రాన్ని చూస్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలా అనిపిస్తుందీ సినిమా. ఏ పనినైనా సింపుల్‌గా చెయ్యాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అబ్బాయికి, ధనవంతురాలైన యువతి తారసపడుతుంది. ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయో తెరపైనే చూడాలి'' అన్నారు.

అలాగే ..''శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎవరికీ తెలియని ప్రదేశాలను చిత్రీకరణకు ఎంచుకున్నాను. అన్నయ్య సాయికిరణ్‌ వినోదం పాళ్లను బాగా దట్టించాడు. ఇవన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయ''న్నారు. తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతూ ''ప్రస్తుతం 'బాహుబలి'పై దృష్టి సారిస్తున్నాను. దీని కోసం యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీ, దేహదారుఢ్యం, శరీర భాషలో మార్పులు చేసుకున్నాను. దీని తర్వాత అన్నయ్య దర్శక నిర్మాణంలో ఓ చిత్రం చేయబోతున్నాను. ఇది వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంద''న్నారు.

కిస్‌ అంటే కీపిట్‌ సింపుల్‌ స్టుపిడ్‌. సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దొంగ వీసాతో అబ్రాడ్‌ వెళ్ళిన ఒక అబ్బాయికి ఇండో అమెరికన్‌ అయిన ఓ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమాయణమే ఈ చిత్రం అని తెలిపారు. శీనుగా వెళ్ళి అక్కడ సన్నీగా పేరు మార్చుకుంటాడు హీరో. పోస్టర్స్‌ని గమనించినట్లయితే అతని ఆటిట్యూట్‌ ఏంటనేది తెలుస్తుంది. లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్‌ వచ్చినా.. తేలిగ్గా తీసుకుంటాడు. హీరో క్యారెక్టర్‌ చాలా ఇన్‌టెన్‌సిటీగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో పియా బెనర్జీ హీరోయిన్. 'మిస్ కెనడా'గా మార్కులు కొట్టేసి, మోడలింగ్ రంగంలో దూకుడు మీదున్న ఈ అమ్మాయి, 'కిస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెమెరా: షెనీల్‌దియో, సహనిర్మాత: ఆనంద్‌ బచ్చు, నిర్వహణ: భవానీ అడివి, దర్శకత్వం: అడివి శేషు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X