పీకినవ్ తీయ్: టీజరే ఇంత అరాచకంగా ఉంది, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్
ధృవ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో వచ్చిన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' టిజర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు
Recommended Video

ధృవ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.
ఈ మధ్య కాలం లో ఇలాంటి సినిమా రాలేదు దాదాపుగా అంతా ఇండస్ట్రీకి పాతవాళ్ళే అయినా మెయిన్ రోల్స్లో ఇప్పటివరకూ కనిపించని ఆర్టిస్ట్ లే. ,ఒక అమ్మాయి సిగరెట్ తాగుతూ,ఇంకో అమ్మాయి, పీకినవ్ తీయ్ అని బూతులు మాట్లాడుతూ.,కొన్ని సీన్లు ఏం జరుగుతోందో అర్ధం కాకుండా ఉంది..
అయితే ఈ కన్ఫ్యూజన్ లోనే సినిమా లో ఉండే థ్రిల్ల్ ని చూపించాలనుకున్నాడేమో దర్శకుడు. చివరిగా అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే పక్కోడి స్క్రీన్ ప్లే లో... అంటూ ముగించారు. మొత్తానికి ఇప్పుడున్న వాతావరణం లో ఇలాంటి కాన్సెప్ట్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











