Geetha Singh: కితకితలు హీరోయిన్ కుమారుడు మృతి.. విషాదంలో కమెడియన్ కుటుంబం!
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే విశ్వనాథ్ కన్నుమూయగా శనివారం లెజండరీ సింగర్ వాణీ జయరాం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
తాజాగా లేడి కమెడియన్ గీతా సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. హాస్య నటిగా ఎన్నో సినిమాల్లో అలరించిన గీతా సింగ్ కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని తెలుగు నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

యాక్సిడెంట్ లో..
సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి మరణ వార్త వినేలోపు మరొకరు కన్నుమూశారనే వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. వివిధ కళలలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, గాయనీగాయకుల మరణంతో సినీ ప్రేక్షక లోకం శోక సంద్రంలో మునిగుతోంది.
అంతేకాకుండా నటీనటులు ఇళ్లలో వాళ్ల కుటుంబీకులు మరణిస్తూ విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా కితకితలు సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన గీతా సింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆమెకు తీరని లోటు మిగిల్చింది.

ఎక్కడ జరిగిందనే వివరాలు..
నిజానికి లేడి కమెడియన్ గీతా సింగ్ కు వివాహం కాలేదు. కానీ తన అన్నయ్య ఇద్దరు పిల్లలను గీతా సింగ్ దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆయన ఇద్దరు కొడుకుల బాధ్యతను గీతా సింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇద్దరు పిల్లలతోపాటు కజిన్ కుమార్తెను కూడా సొంత పిల్లలుగా భావిస్తూ పోషిస్తున్నారు.
అయితే శుక్రవారం రోజున గీతా సింగ్ పెద్ద కుమారుడు నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గీతా సింగ్ కుమారుడు మరణించగా.. అతని పేరు, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఎవడిగోల వాడిది చిత్రంతో..
ఇదిలా ఉంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన గీతా సింగ్ కు మొదట్లో తెలుగు రాదట. హిందీ మాత్రమే మాట్లాడే గీతా సింగ్ ఫ్యామిలీ తెలంగాణలోనే సెటిల్ కావడంతో.. తెలుగు నేర్చుకున్నారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ప్రముఖ కామెడీ డైరెక్టర్, దివంగత ఈవీవీ సత్యనారాయణ ఆమెకు అవకాశం ఇచ్చారు.
ఎవడిగోల వాడిది చిత్రంతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయం అయిన గీతా సింగ్ ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి పాపులర్ అయ్యారు. ఇందులో నరేష్ కు భార్యగా ఆకట్టుకున్నారు.

టాప్ కమెడియన్స్ తో..
కితకితలు సినిమా ఫేమ్ తో గీతా సింగ్ కు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొత్తంగా 50కి పైగా సినిమాల్లో నటించారు గీతా సింగ్. ఆలీ, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం వంటి పాపులర్ కమెడియన్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు గీతా సింగ్. అయితే గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించని గీతా సింగ్ ఆ మధ్య జబర్దస్త్ షోలో సందడి చేశారు.

పిల్లలే జీవితంగా..
కాగా పెళ్లి చేసుకోని గీతా సింగ్ కు తన అన్నయ్య చాలా ఇష్టం. ఆయన నిజమాబాద్ లో ఉండేవారు. ఆయనకు అనారోగ్యం కారణంగా పెద్ద కుమారుడుని హైదరాబాద్ తీసుకొచ్చారు గీతా సింగ్. తన కొడుకుగా పెంచుకున్నారు. కొన్నాళ్లకు అన్నయ్య చనిపోవడంతో.. రెండో కుమారుడుని కూడా తీసుకొచ్చేసుకున్నారు.
ఈ ఇద్దరు అబ్బాయిలతోపాటు తన కజిన్ కుమార్తెను కూడా గీతా సింగ్ పోషిస్తున్నారు. ఆ ముగ్గురు పిల్లలే తన జీవితం అని, ఇంకెవ్వరూ లేరని ఒక ఇంటర్వ్యూలో గీతా సింగ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











