'కిట్టు'దర్శకుడి నెక్ట్స్ చిత్రం 'హాయిహాయిగా'
యానిమేషన్ చిత్రం 'కిట్టు'తో జాతీయ అవార్డును అందుకున్న దర్శకుడు సత్య తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'హాయిహాయిగా'. సూర్య,ద్రువ పటేల్ నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు త్వరలో విడుదల కానున్నాయి. సత్య మాట్లాడుతూ "కాకతాళీయంగా జరిగిన ఓ సంఘటన ముగ్గురు జీవితాలను ఎలా మలుపు తిప్పింది? ఎలా శాసించింది? అనే అంశంతో తెరకెక్కిన చిత్రం 'హాయి హాయిగా'. సినిమా చూసినంత సేపు హాయిగా నవ్వుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది.
రఘుబాబు, హీరో మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రెగ్యులర్ చిత్రాలలో ఓ భిన్నమైన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది'' అని తెలిపారు. నిర్మాత రాజు ప్రముఖ్ మాట్లాడుతూ "స్రిప్ట్‌లో చెప్పిన విషయాన్నే తెరమీద చూపించాడు దర్శకుడు. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. తప్పకుండా మా బ్యానర్‌కు మంచి పేరు తెస్తుంది'' అని చెప్పారు.
ఓ కొత్త పాయింట్‌తో వస్తున్నట్టు హీరో సూర్య ప్రతాప్ తెలిపారు. పనోరమా పెంగ్విన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సూర్య ప్రతాప్, ద్రువ పటేల్, రఘుబాబు, రిథిమా తివారి, శ్రీనివాసరెడ్డి, విజయ్, చలపతిరావు, గిరిబాబు, సూర్య, కల్పన తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: జీవన సత్యం, పాటలు: భాస్కరభట్ల, వనమాలి.


Click it and Unblock the Notifications











