»   »  ‘జానీ జానీ ఎస్ పప్పా...డ్రికింగ్ వోడ్కా నో పప్పా’ సోషల్ మీడియాలో సాంగ్ వైరల్!

‘జానీ జానీ ఎస్ పప్పా...డ్రికింగ్ వోడ్కా నో పప్పా’ సోషల్ మీడియాలో సాంగ్ వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: రాజ్ తరుణ్, అను ఎమ్మాన్యుయేల్ హీరో హీరో హీరోయిన్లుగా వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'. ఎకె ఎంటర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ఒకటి రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'జానీ జానీ ఎస్ పప్పా... డ్రింకింగ్ వోడ్కా నో పప్పా' అంటూ సాంగే ఈ సాంగ్ లిరిక్స్ కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో సినిమాను మార్చి 3కు వాయిదా వేసారు. కాగా ఈ చిత్రం ప్రచారంలో భాగంగా సినిమాలోని పాటల వీడియోలను ఒక్కొక్కటీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ''అర్థమైందా'' సాంగ్‌ను మంచి స్పందన వస్తోంది.

rn

జానీ జానీ ఎస్ పప్పా... డక్రింగ్ వోడ్కా నో పప్పా

‘జానీ జానీ ఎస్ పప్పా... డ్రింకింగ్ వోడ్కా నో పప్పా' అంటూ సాంగే ఈ సాంగ్ లిరిక్స్ కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

rnrn

అర్థమైందా సాంగ్

ప్రేమికుల రోజు సందర్భంగా అర్ధమైందా సాంగ్ రిలీజ్ అయింది. రాజ్ తరుణ్ సినిమాలపై ఇప్పటికే చాలా మందిలో క్రేజ్ నెలకొంది. ఈ సాంగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

rnrnrn

ఆకట్టుకున్న ట్రైలర్

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమా తప్పకుండా సూపర్ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

 ముద్దు సీన్

ముద్దు సీన్

'ఉయ్యాల జంపాల'తో అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌తరుణ్‌, 'కుమారి 21 ఎఫ్‌', సినిమా చూపిస్తా మావా తదితర చిత్రాలతో యంగ్‌ హీరోల రేసులోకి వచ్చేసి, వరస హిట్స్ తన ఉనికిని బాగానే చాటుకుంటున్నాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Watch & Enjoy Johny Johny Song With English Lyrics From Kittu Unnadu Jagratha Movie. Starring Raj Tarun, Anu Emmanuel. Music composed by Anup Rubens, Directed by Vamsi Krishna, Produced by A.K.Entertainments as Production no.8.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu