twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేసుదాస్‌కు 'హరివరాసనం'అవార్డ్‌

    By Srikanya
    |

    KJ Yesudas
    ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సినీ సంగీత నేపథ్యగాయకుడు కె జె జేసుదాస్‌ను 'హరివరాసనం' పురస్కారం వరించింది. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంతో పాటు దక్షిణ కేరళలోని ప్రధాన ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావన్కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టిడిబి) పాలకమండలి ఈ పురస్కార గ్రహితగా ఏసుదాస్‌ పేరును ప్రకటించింది. సంప్రదాయ సంగీతానికి ఏసుదాస్‌ చేసిన సేవతో పాటు ఆయన అనుసరించిన లౌకిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కేరళ దేవాదాయశాఖ మంత్రి వి ఎస్‌ శివకుమార్‌ విలేఖర్లతో అన్నారు. పురస్కారంలో భాగంగా రూ.50,000 నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను ఈ గాయకునికి ప్రదానం చేస్తారు.

    ఏప్రిల్‌ నెలలో వచ్చే కేరళ నూతన సంవత్సరాది రోజైన 'విషు' పర్వదినాన ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. స్వామి అయ్యప్ప పరమభక్తుడైన ఏసుదాసు శబరిగిరీశునిపై ఎన్నో భక్తిగీతాలను ఆలపించారు. ఈ గీతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హరివరాసనం' పేరిటే ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. ఈ గీతం ప్రతిరోజూ శబరిమలపై మారుమోగుతూ భక్తులను పరవశింపజేస్తుంది. కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి ఆలయంలో గతవారం తన 72వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఏసుదాస్‌ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.

    హిందూ, క్రైస్తవ, ముస్లిం భక్తిగీతాలని భావయుక్తంగా ఆలపించి తన 50 ఏళ్ళ సంగీత జీవితంలో అశేష అభిమానుల హృదయాల్ని గెల్చుకున్నారు. ఇందుకు సంకేతంగా 'ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం' అన్న సందేశాన్నిచ్చే శ్రీ నారాయణగురు గీతాన్నే నవంబర్‌ 14, 1961వ తేదీన తన తొలి సినిమా పాటగా ఏసుదాస్‌ ఆలపించారు. ధట్స్ తెలుగు ఈ అధ్బుత గాయకుడుకి శుభాకాంక్షలు తెలుపుతోంది.

    English summary
    KJ Yesudas has been chosen for the first Harivarasanam award of the Travancore Devaswom Board (TDB).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X