గోల్డెన్ జూబ్లీలో అడుగిడిన కె.జె. ఏసుదాసు

By Bojja Kumar

భారత సినీ ప్రపంచానికి వరంలా అందిన అమృత 'గాయ కుడు' ఆయన. ఈ ఒక్క వాక్యంలో చెప్పాలంటే...వీనులవిందైన స్వరం, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత. ఆయన ఎవరో కాదు...ఇండియన్‌ మ్యూ జిక్‌ లెజెండ్‌ కె.జె.ఏసుదాసు. నేపథ్య గాయకుడిగా ఏసుదాసు 50 ఏళ్ళు(గోల్డెన్ జూబ్లీ) పూర్తిచేసుకున్నారు. 71 ఏళ్ళ ఏసుదాసు 21 ఏళ్ళ వయస్సులో సంగీత ప్రపంచంలో కాలుపెట్టారు. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 1961, నవంబరు 14న తొలి సినిమా పాటను ఆలపించారు. జేసు దాసు ఇప్పటి వరకు 50 వేల పైచిలుకు పాటలు పాడారు.

తండ్రి నుంచి వారసత్వంగా సంగీతాన్ని అందుకున్న ఏసుదాసు ఎర్నాకులంలోని ఆర్‌ఎల్‌వి మ్యూజిక్‌ అకాడమీలో చేరారు. అనంతరం శ్రీ స్వాతి తిరునల్‌ మ్యూజిక్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. దక్షిణ భారత శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న ఏసుదాసు లెజెండరీ చెంబై వైద్యనాథ భాగవతార్‌తో పాటు, వెచూర్‌ హరి హర సుబ్రమణ్య అయ్యర్‌ వంటి ప్రముఖుల వద్ద తన నైపుణ్యానికి మెరుగులు అద్దుకున్నారు.

మాతృభాష మళయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, హిందీ, బెంగాలి, గుజరాతి, ఒడియా, మరాఠి, సంస్కృ తం, తుళు వంటి భారతీయ భాష ల్లోనే కాదు మాలే, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఇంగ్లీష్‌ వంటి విదేశీ భాష ల్లోనూ పాటలు పాడిన ఘనత కేవలం ఏసుదాసుకే దక్కుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా ఏడుసార్లు ఏసుదాసు అవార్డును అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రస్థాయిలో 30సార్లు అవార్డులు తీసుకున్నారు. మళయాళం, తమిళం, కన్నడ, తెలుగు, బెంగాలి వంటి అన్ని భాష ల్లోనూ ఆయనకు అవార్డులు వచ్చా యి. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఆయన స్వరంతో పోల్చదగిన స్వరం ఇంతవరకూ రాలేదంటే అతిశయోక్తి కాదేమో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X