twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ హాస్యనటుడికి సీరియస్.. కెనడాకు తరలింపు

    In October 2015, Kader Khan had been admitted to Baba Ramdev's ashram in Haridwar to ease the pain in his joints and for diabetes.

    By Rajababu
    |

    బాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడు ఖాదర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం కెనడాకు తరలించారు. ఇటీవల ఆయనకు మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ఖాదర్ ఖాన్ పరిస్థితి మెరుగపడకపోగా ఆరోగ్యం మరింత క్షీణించింది. గత మూడేండ్లుగాఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వీల్ చైర్‌కే పరిమితమయ్యారు.

    ఖాదర్ ఖాన్ ఆరోగ్యంపై స్పందించిన శక్తికపూర్

    ఖాదర్ ఖాన్ ఆరోగ్యంపై స్పందించిన శక్తికపూర్


    ఖాదర్ ఖాన్ అనారోగ్యంపై ప్రముఖ నటుడు, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తికపూర్ స్పందించారు. ఖాదర్ ఖాన్ వీల్ చైర్‌కే పరిమితమయ్యారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయనతో మాట్లాడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. ఆయన ఫోన్ నంబర్ లభించడం లేదు. మరో రెండు రోజుల్లో ఖాదర్ ఖాన్‌తో మాట్లాడుతాను అని ఆయన అన్నారు.

    చికిత్స కోసం కెనడాకు తరలింపు

    చికిత్స కోసం కెనడాకు తరలింపు

    ఖాదర్ ఖాన్ కుమారుడు కెనడాలో నివసిస్తున్నారని, అందుకే ఆయనను అక్కడికి తీసుకెళ్లి ఉంటారమోననే అనుమానాన్ని శక్తి కపూర్ వ్యక్తం చేశారు. ఆయనకు మోకాలి నొప్పి ఉందని, అందుకోసం చేసిన సర్జరీ వికటించింది అని ఆయన తెలిపారు.

    2015లో ఓ హిందీ చిత్రం ఆడియో ఆవిష్కరణలో ఖాదర్ కనిపించారు

    2015లో ఓ హిందీ చిత్రం ఆడియో ఆవిష్కరణలో ఖాదర్ కనిపించారు


    2015లో ఓ హిందీ చిత్రం ఆడియో ఆవిష్కరణలో ఖాదర్ కనిపించారు. ఆ తర్వాత చిత్రాల్లో నటించలేదు. కొందరు నిర్మాతలు సంప్రదించినా ఆరోగ్యం సహకరించడం లేదని సినిమాలను ఖాదర్ ఖాన్ నిరాకరించారు.

    ఆరోగ్యం సహకరించడం లేదని సినిమాలు..

    ఆరోగ్యం సహకరించడం లేదని సినిమాలు..

    2015లో మోకాలి నొప్పి, మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఖాదర్ ఖాన్ హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమంలో చేరారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పేమి కనిపించలేదు. దాంతో ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించారు.

    English summary
    In October 2015, Kader Khan had been admitted to Baba Ramdev's ashram in Haridwar to ease the pain in his joints and for diabetes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X