బాబా రామ్ దేవ్ ఓకే చేస్తేనే సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తాం...
మీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ కావాలంటే...రామ్ దేవ్ బాబా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని పట్టు పట్టారు సెన్సార్ వారు. సంజయ్ దత్, కంగనారౌనత్ కాంబినేషన్ లో మణిశంకర్ రూపొందిస్తున్న నాక్ అవుట్ చిత్రం గురించి ఈ కండిషన్ పెట్టారు. అదేంటి సినిమా సర్టిఫికేట్ కావాలంటే మధ్యలో రామ్ దేవా బాబా కి ఏం సంభంధం అంటే..ఈ చిత్రం రిలీజ్ చేస్తున్న ప్రోమోలలో ..ఇర్ఫాన్ ఖాన్..సంజయ్ దత్ ని నీకేం కావాలి అంటాడు. దానికి సంజయ్ దత్..వెంటనే..బాబా రామ్ దేవ్ తన ఫాలోయర్స్ నుంచి ఏమి ఆశిస్తున్నారో అదే నాకు కావాలి అని సమాధానం చెప్తాడు. దీనికి అబ్జెక్షన్ చెప్పారు సెన్సార్ వారు. బ్రతికున్న మనిషి గురించి డైలాగు చెప్తే ఇబ్బందని, అంతగా కావాలంటే రామ్ దేవ్ బాబా...నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని అన్నారు. వెంటనే మణిశంకర్ స్పందించి..రామ్ దేవా బాబాతో తనకున్న పరిచయం పురస్కరించుకుని సర్టిఫికేట్ సమర్పించారు. ఇదే విషయం మీడియాతో మాట్లాడుతూ..నేను గతంలో స్పిరిట్యువల్ గా కొన్ని డాక్యుమెంటరీలు చేసాను కాబట్టి నాకు ఆ గురువులతో పరిచయం ఉంది. అదే మరొకరు అంత త్వరగా సర్టిఫికేట్ దొరికేదా..అయినా అయిన దానికీ కానీ దానీకి సెన్సార్ ..క్రియేటివిటీని దెబ్బతీసేలా ఆంక్షలు పెడుతోందని ఆవేదనతో చెప్పారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











