ప్రభుదేవా దృష్టిలో బాగా డాన్స్ చేసే తెలుగు హీరో
సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకులు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డాన్స్ లకు ప్రత్యేక స్థానం ఉంది. ఓ దశలో స్టార్ హీరోలందరూ ప్రభుదేవా చెప్పిన విధంగా డాన్స్ చేయాలని ఆసక్తి చూపించేవారు. ఇప్పుడాయన డాన్స్ నుంచి దర్శకత్వం వైపు వెళ్లారు. దక్షిణాదినే కాదు బాలీవుడ్‌లోనూ ఆయన దర్శకుడిగా విజయాలు సాధిస్తున్నారు.
హిందీలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'రామయ్య వస్తావయ్యా' సంగతులు గురించి చెప్తూ...తెలుగులో నేను తీసిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఆధారంగానే ఆ చిత్రం రూపొందింది. వచ్చే నెల 19న విడుదలవుతుంది. మా యూనిట్ చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం 'రాంబో రాజ్‌కుమార్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. షూటింగ్ తుది దశకు చేరింది.
ఇక తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి చాలా కాలమైంది. మళ్లీ తెలుగు సినిమా చేసే ఆలోచన ఉందా అని అడిగితే... నేనెక్కడికీ వెళ్లలేదు. హిందీలో దర్శకత్వం వహించేందుకు కొన్ని ఒప్పందాలు చేసుకున్నాను. అందుకే అక్కడి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications












