twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుదేవా దృష్టిలో బాగా డాన్స్ చేసే తెలుగు హీరో

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు ఇష్టమైన డాన్స్ చేసే హీరో తెలుగులో ఎవరు ఉంటారనేది అందరకి ఆసక్తే. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ... తెలుగు సినిమాల్లో అందరూ ఇష్టమే. నృత్యం విషయంలో నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఆయన నృత్యాలు చాలా బాగుంటాయి. ఈ తరంలో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, రామ్‌... వీళ్లు బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు అన్నారు.

    సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకులు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా డాన్స్ లకు ప్రత్యేక స్థానం ఉంది. ఓ దశలో స్టార్ హీరోలందరూ ప్రభుదేవా చెప్పిన విధంగా డాన్స్ చేయాలని ఆసక్తి చూపించేవారు. ఇప్పుడాయన డాన్స్ నుంచి దర్శకత్వం వైపు వెళ్లారు. దక్షిణాదినే కాదు బాలీవుడ్‌లోనూ ఆయన దర్శకుడిగా విజయాలు సాధిస్తున్నారు.

    హిందీలో ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'రామయ్య వస్తావయ్యా' సంగతులు గురించి చెప్తూ...తెలుగులో నేను తీసిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఆధారంగానే ఆ చిత్రం రూపొందింది. వచ్చే నెల 19న విడుదలవుతుంది. మా యూనిట్ చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం 'రాంబో రాజ్‌కుమార్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. షూటింగ్ తుది దశకు చేరింది.

    ఇక తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించి చాలా కాలమైంది. మళ్లీ తెలుగు సినిమా చేసే ఆలోచన ఉందా అని అడిగితే... నేనెక్కడికీ వెళ్లలేదు. హిందీలో దర్శకత్వం వహించేందుకు కొన్ని ఒప్పందాలు చేసుకున్నాను. అందుకే అక్కడి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాను అని చెప్పారు.

    English summary
    Prabhu considers Chiranjeevi as his dance guru. Recently he was in Hyderabad to judge a dance show. When asked about who is the best dancer in today's Tollywood stars? Prabhudeva said that in this generation Jr. NTR, Allu Arjun, Charan and Ram are the best dancers. All are doing good work. He also added that in Bollywood Hrithik is the best dance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X